For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీఎన్ఆర్ కుటుంబానికి అండగా టాలీవుడ్.. మెగాస్టార్ చిరు, సంపూల ఆర్థిక సాయం!

  |

  కరోనా కారణంగా ప్రముఖ సినీ జర్నలిస్ట్ తదుపరి కాలంలో నటుడిగా మారిన టిఎన్ఆర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి దాదాపు టాలీవుడ్ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏప్రిల్ చివరి వారంలో కూడా ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న తుమ్మల నరసింహ రెడ్డికి మే నెల మొదటి వారంలో కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.. అయితే కొద్ది రోజుల పాటు చానళ్ల పాటు ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఆయనకు ఊపిరి అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  అండగా ఉంటాం

  అండగా ఉంటాం


  టీఎన్ఆర్ కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి పెద్దదిక్కుగా ఉన్న చిరంజీవి లక్ష రూపాయలు తక్షణ ఖర్చులు నిమిత్తం కుటుంబానికి అందజేశారు. చిరంజీవి తరపున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రముఖ జర్నలిస్టు సంతోషం సురేష్ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి అందజేసిన నగదును టిఎన్ఆర్ భార్యకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి టిఎన్ఆర్ భార్య జ్యోతితో కూడా మాట్లాడినట్లు సమాచారం.

  చిరంజీవి స్ఫూర్తితో

  చిరంజీవి స్ఫూర్తితో


  మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్, తనదైన మార్గంలో దర్శకత్వం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇక జర్నలిస్ట్ గా మారిన ఆయన అనేక ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఇక టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మే 11 సాయంత్రం టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.

  ఎంతో మందికి స్ఫూర్తిదాయకం

  ఎంతో మందికి స్ఫూర్తిదాయకం


  టీఎన్ఆర్ చేసిన చాలా ఇంటర్వ్యూలు తాను చూశానని ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతగానో ఆకట్టుకునేది అని చిరంజీవి టీఎన్ఆర్ భార్యతో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు. పట్టుదలతో జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు. కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా తామందరం ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారు.

  200 ఇంటర్వ్యూ మీతోనే చేయాలని

  200 ఇంటర్వ్యూ మీతోనే చేయాలని


  ఇక టీఎన్ఆర్ భార్య చిరంజీవితో మాట్లాడుతూ టీఎన్ఆర్ కు మీరంటే ఎనలేని అభిమానం అని 200 ఇంటర్వ్యూ మీతోనే చేయాలని ఎప్పటి నుంచో కలలుగనే వారని ఆమె పేర్కొన్నారు. మీరు ఫోన్ చేస్తారని, ఇలా సహాయం చేస్తారని భావించలేదని టీఎన్ఆర్ భార్య భావోద్వేగానికి గురయ్యారు. ఇక మరో పక్క నటుడు సంపూర్ణేష్ బాబు సైతం ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

  Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu

  సంపూర్నేష్ సైతం


  ''తెలుగు సినిమా జర్నలిస్టు టీఎన్ఆర్ గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సహాయం తప్పక చేయగలను. మీరు కూడా వారి కుటుంబానికి సపోర్ట్ చెయ్యండి. ఈ కష్టకాలంలో మనిషికి మనిషికి తోడుండాలి'' అని ఆయన పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం టీఎన్ఆర్ భార్య అకౌంట్ నెంబర్ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తమ అభిమాన ఇంటర్వ్యూయర్ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతూ పెద్ద ఎత్తున డిపాజిట్ చేస్తున్నారు.

  English summary
  Film journalist Thummala narsimha Reddy passed away due to covid complications yesterday in Hyderabad. Now the film personalities like chiranjeevi came forward to help his family e financially. Megastar chiranjeevi handed over a sum of 100000 rupees to journalist's family. Another actor sampoornesh Babu also donated 50000 rupees to journalist's family
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X