For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెడలో దండెసి గొర్రెని బలికి తీసుకెళ్లినట్టు.. తన పెళ్లి స్టోరీతో పొట్టపగిలేలా నవ్వించిన చిరు

  |

  తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అల్లు రామలింగయ్య పుట్టినరోజు సందర్భంగా అల్లు ఫ్యామిలీ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని లాంచ్ చేశారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో నవ్వించింది. ఒకవైపు ఆయనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఎంతో కామెడీగా తన పెళ్లినాటి విషయాలను తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  మరొక కోణం ఉంది

  మరొక కోణం ఉంది

  చిరంజీవి మాట్లాడుతూ.. మొదట అల్లు రామలింగయ్య గారి దృష్టి నా మీదే ఉంది అని ఆ తర్వాత తెలిసింది. మిగతా వాళ్ళు చెబితే నాకు అర్థం అయింది. అలాగే ఆయనకు మరొక కోణం ఉంది అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత మద్రాసు నుంచి వెళుతున్నప్పుడు ఒక ట్రైన్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. అప్పుడు ఆయన రాంగోపాల్ రావు గారు మందుతో రెడీగా ఉన్నారు. అప్పుడు నాకు కూడా సైగ చేశారు కానీ నేను ఆంజనేయస్వామి భక్తుడిని అలాంటివి అలవాట్లు లేవు అని అన్నట్లు చిరు తెలిపారు.

  అప్పుడే పెళ్లి వద్దు అన్నాను

  అప్పుడే పెళ్లి వద్దు అన్నాను

  ఇక తర్వాత మరొక రోజు షూటింగ్ లో గీత అనే అమ్మాయితో మిగతా వాళ్ళందరూ చనువుగా ఉంటే నేను మాత్రం మరొక దగ్గర హార్స్ రైడింగ్ చేస్తున్నాను. మళ్ళీ అప్పుడు అక్కడ ఒక టిక్ చేసుకున్నారు. ఇక తర్వాత ఒక ప్లాన్ జరిగింది అని అర్థమైంది. అల్లు రామలింగయ్య గారు అల్లు అరవింద్ జయకృష్ణ అందరూ కూడా ఈ కుర్రాన్ని ఎలా నొక్కేద్దామని ఆలోచించారు. ఇక అప్పుడు ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్నది జయకృష్ణ మా దగ్గరికి వచ్చి పెళ్లి గురించి అడిగారు. కానీ నేనిప్పుడు పెళ్లి గురించి వద్దు అని అన్నాను అని చిరంజీవి తెలియజేశారు.

  ఫ్యూచర్ ముందే కనిపెట్టేశారు

  ఫ్యూచర్ ముందే కనిపెట్టేశారు

  కానీ ఈ టైంలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నాన్నగారు అడ్రస్ తీసుకొని వెళ్లారు. ఈ ఆ తర్వాత మా నాన్నగారు పెళ్లి చేద్దామా వద్దా అని అనుకుంటూ ఉండగా అల్లు అరవింద్ మాత్రం ఇచ్చేద్దాం అని ఫ్యూచర్ కనపడుతుంది అని దానితో ట్రావెల్ చేసే నా ఫ్యూచర్ కూడా కనిపిస్తుంది అని అనుకున్నారు. ఆయన నా భవిష్యత్తు ముందే కనిపెట్టేశారు. మనం అమాయకులను ప్రతిదీ కూడా తెలిసేది కాదు.

  అమ్మాయిలు ఎలా ఉంటారో తెలియదు

  అమ్మాయిలు ఎలా ఉంటారో తెలియదు

  ఇక తర్వాత అల్లు రామలింగయ్య గారు కూడా నా గురించి మొత్తం విచారించి ఎలాంటి చెడు అలవాట్లు లేవని మంచి అబ్బాయి అని తెలియగానే కూతురుని ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు. ఇక తర్వాత మా నాన్నగారు జయకృష్ణ వెళ్లి పెళ్లి గురించి మాట్లాడేశారు. ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలియదు మళ్లీ మీ అబ్బాయి కూడా భోజనం సరిగ్గా చేయక చిక్కిపోతున్నాడు కాబట్టి ఇలాంటి టైం లో సంప్రదాయం ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో మా నాన్నగారు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు.

  దండేసి గొర్రెని బలికి తీసుకెళ్లినట్టు

  దండేసి గొర్రెని బలికి తీసుకెళ్లినట్టు

  ఆ తర్వాత నన్ను ఎలా తీసుకెళ్లారు అంటే దండేసి గొర్రెని బలికి తీసుకెళ్లినట్టు తీసుకువెళ్లారు. అప్పుడు ఉ అందామా ఊఉ అందమా అని అనుకున్నాను. కానీ మనకు కెరీర్ ముఖ్యం అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత సురేఖ కాఫీ ఇవ్వగానే అందులో ఏం కలిపిందో ఏమో గాని అది ఇవ్వగానే ఓకే అనేశాను. ఇక తర్వాత కళ్ళు మూసి తెరిచేసరికి పెళ్లి అయిపోయింది. రెండు నెలల్లోనే పెళ్లి అయిపోయింది.

  మూడు రోజుల్లో పెళ్లి ఫినిష్

  మూడు రోజుల్లో పెళ్లి ఫినిష్

  పెళ్లికి ముందు మరో స్టోరీ ఉంది. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఎమ్ఎస్ రెడ్డి గారితో ఒక సినిమా చేస్తున్నప్పుడు. ఆయన డేట్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. అయినప్పటికీ కూడా అల్లు అరవింద్ పెళ్లి ఎలాగైనా మూడు రోజులు సంపాదిస్తానని చెప్పుకుని మాట్లాడారు. లేదంటే సినిమా ఆపేస్తామని కూడా అన్నారు. ఒకటి పెళ్లి కొడుకు చేయడానికి రెండు పెళ్లికి మూడు అదేదో చేస్తారు కదా అని మూడు రోజులు బ్రేక్ ఇచ్చేలా చేశారు.. కొత్త పెళ్లి కూడా చాలా చిరాకు చిరాకుగా అయిపోయింది అని మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా తెలియజేశారు. కానీ అలాంటి ఫ్యామిలీలో నేను ఒక కొడుకు తరహాలో కలిసిపోయాను అని చాలా ఆనందంగా ఉంది.. అని అన్నారు.

  English summary
  Megastar chiranjeevi hilarious speech at Allu Ramalingaiah book launch..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X