మెగాస్టార్ మరో గౌరవం.. 19న అవార్డు అందుకోనున్న చిరంజీవి.. ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నటిస్తున్నారో తెలిసింది. చివరిగా బాసు వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 'బోళా శంకర్' చిత్రం మాత్రం ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. మెగాస్టార్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చి చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కాస్త రూటు మార్చి యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉంటూ టాలీవుడ్ లో ఎలాంటి సమస్య ఎదురైనా తానే ముందు నిలిచి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో మెగాస్టార్ ఇతర పరిశ్రమనే నమ్ముకున్న జూనియర్ ఆర్టిస్టులను ఎంతలా చేరదీసి ఆదుకున్నారో తెలిసిందే. ఎంతో మందికి వైద్యం తనకు వీలైనంత మేరకు అందించారు. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను తానే ముందుండి పరిష్కరించేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇలా ఎన్నో సేవలను చిత్ర పరిశ్రమకు చిరంజీవి అందిస్తూనే ఉన్నారు.

చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండుసార్లు పద్మ అవార్డులను చిరంజీవి అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో పురస్కారం అందుకున్నారు. ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచే అరుదైన పురస్కారాన్ని అందుకోవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చిరంజీవికి ఓవైపు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే మరో వైపు అరుదైన గౌరవాన్ని అందుకున్నందుకు గానూ కంగ్రాస్ట్ తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవికి మరో గౌరవం దక్కింది. అది కూడా UK పార్లమెంట్ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు)ను సొంతం చేసుకున్నారు. సినీరంగానికి మెగాస్టార్ చిరంజీవి అందిస్తోన్న విశేషసేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం చిరంజీవికి పురస్కారాన్నిప్రకటించింది. ఈనెల 19న యూకే ప్రభుత్వం చిరంజీవికి అవార్డ్ ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించబోతోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వ్యాపిస్తోంది. దాంతో సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు అవార్డులు అందిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా 2024లో కేంద్ర ప్రభుత్వం చేత అత్యుత్తమ పురస్కారం పద్మ విభూషణ్ అవార్డ్ ను అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డున స్వీకరించిన సంగతి తెలిసిందే. అంతకు ముందే 2006లో మెగాస్టార్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్ ను అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఐఫా అవార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక 2016లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి రఘపతి వెంకయ్య అవార్డుతో గౌరవం అందుకున్నారు. మరోవైపు చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత యంగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్లు శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











