మజాకాలో చిరంజీవి.. మెగాస్టార్ పేరు ఎత్తగానే ఝల్లుమన్న సందీప్ కిషన్.. ఏమైందంటే
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా 'మజాకా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యంగ్ హీరోయిన్ రీతూ వర్మ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో నటించింది. ప్రముఖ నటుడు రావు రమేశ్, 'మన్మథుడు' హీరోయిన్ అన్షు అంబానీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి తారలు విభిన్న పాత్రలతో అలరించారు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి కొంత పాజిటివ్ టాకే దక్కింది. క్రేజీ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేట్రికల్ రన్ బాగానే కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విషయంలో సందీప్ కిషన్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఓ మాట అన్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని రెఫర్ చేస్తూ చెప్పారు. అది కాస్తా జనాల్లోకి రాంగ్ గా వెళ్లింది. దానిపై పలువురు అపార్థం చేసుకునే అవకాశం ఉందని తాజాగా సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవిని ఆ ఉద్దేశంతో చెప్పింది కాదని అన్నారు. ఇంతకీ సందీప్ కిషన్ ఏమన్నారో? ఏ సందర్భంలో మాట్లాడారో తెలుసుకుందాం.. సందీప్ కిషన్ 'మాజాకా' మూవీ ప్రమోషన్స్ ను ఇటీవల జోరుగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సందీప్ కిషన్ కు 'మజాకా' సినిమాలో చిరంజీవి అడిగారంట? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ కిషన్ .. అలా కాదు.. రావు రమేశ్ గారి పాత్రలో చిరంజీవి చేయాల్సిన స్క్రిప్ట్ ఇది.. అసలు ఈ స్క్రిప్ట్ మొత్తం మెగాస్టార్ కోసం డిజైన్ చేసిందే.. కానీ ఎందుకో చిరంజీవి వద్దుకున్నాకే మా దగ్గరకి వచ్చింది. ఆ సబ్జెక్ట్ కు కొన్ని మైనర్ ఛేంజ్ లు చేసి 'మజాకా'ను రెడీ చేశామని చెప్పారు. కానీ సందీప్ చెప్పిన మాటాల్లో కొందరు 'సందీప్ కిషన్ మజాకాలో... రావు రమేశ్ పాత్రకు చిరంజీవి'ని సంప్రదించినట్టు ప్రచారం చేశారు.
ఇదే ప్రశ్న మళ్లీ సందీప్ కిషన్ కు ఎదురైంది. ఇలా ప్రచారం జరుగుతుందని అడిగిన రిపోర్ట్ కు మరోమారు క్లారిటీ ఇచ్చారు. మజాకాలో చిరంజీవి గారు కాదండీ.. మెగాస్టార్ వద్దకు వెళ్లిన స్క్రిప్ట్ వద్దనుకున్నాక మేం చేశాం.. అని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ ను రావు రమేశ్ పాత్రకు అడగలేదు.. తన సినిమాకు అంత లేదనే భావనతో ఎక్స్ ప్రెషన్ పలికించారు. అంతకు ముందు కూడా చిరంజీవి గారితో మీరెందుకు కలిసి పనిచేయబోరు అని అడిగినందుకు కూడా... అలా అవకాశం కూడా రావాలి కదా అని చెప్పుకొచ్చారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు వీలైనంత వరకు యంగ్ యాక్టర్స్ ను ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. రీసెంట్ గా 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్, సిద్ధూ జొన్నలగడ్డ సినిమాలకు ప్రమోషన్స్ లో సాయం అందిస్తున్నారు. సత్యదేవ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి, శ్రీముఖి కూడా తన సినిమాల్లో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఏడు పదుల వయస్సుకు దగ్గరున్నా.. ఏమాత్రం అలుపులేకుండా సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలకు పోటీగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం 'విశ్వంభర'ను పూర్తి చేసుకుంటున్నారు. ఆ నెక్ట్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











