మెగాస్టార్ హల్చల్.. చిరు ఇన్‌స్టాగ్రామ్ ఫస్ట్ పోస్ట్ ఏంటంటే..?

మెగాస్టార్ చిరంజీవి దూకుడుమీదున్నాడు. ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి హల్చల్ చేస్తున్నాడు. ట్విట్ఱర్‌లోకి దూకిన చిరంజీవి ట్వీట్ల యుద్దాన్ని మొదలు పెట్టాడు. మొదటి ట్వీట్‌లో తన అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు, కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలను వివరించాడు చిరంజీవి. ట్వీట్లతో మెగాస్టార్ చేసే సందడికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

రెండో ట్వీట్‌లో 21 రోజుల షట్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధించాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఇరువురు సీఎంలు కేసీఆర్, జగన్ నిర్ణయాలను ప్రజలు పాటించాలని సూచించాడు. అందరూ ఇంటి పట్టునే ఉండాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపాడు. మూడో ట్వీట్‌లో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ గురించి పేర్కొన్నాడు. మోషన్ పోస్టర్ చూస్తున్నంతసేపు కన్నులపండువగా, రోమాలు నిక్కబొడుచేలా ఉందని ప్రశంసించాడు.

Megastar Chiranjeevi Instagram First Post

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు సందడి చేశాడు. నిన్నటి ప్రొఫైల్ పిక్‌కు దాదాపు 2 లక్షల లైకులు వచ్చాయి. కనీసం ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే నాలుగు లక్షలకుపైగా ఫాలోవర్స్ వచ్చారు. కాసేపటి క్రితమే చిరు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అమ్మ అంజనాదేవీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ.. హోమ్ టైమ్.. అమ్మ టైమ్.. ఈ కొత్త ఏడాది అవగాహనతో, బాధ్యతతో క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడాలని కోరాడు. మరీ ప్రత్యేకంగా ఇలాంటి సమయంలో మన అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని అభిమానులకు సూచించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X