Pakka Commercial: స్టేజ్ మీదే ఆ నటుడికి షాకిచ్చిన మెగాస్టార్..

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వివరాల్లోకి వెళితే

కేరింతలు

కేరింతలు

కోవిడ్ కారణంగా ఒక ఈవెంట్ కి ఇంత మంది జనం రావడం బాగా తగ్గిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఇంత మంది జనాన్ని చూస్తున్నా అని అన్నారు. ఇంత మందిని ఒకే చోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్న మెగాస్టార్ చిరంజీవి ఇక్కడికి కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు. తమ అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొన్నారు. మీ కేరింతలను చూస్తుంటే సినిమా ఎలా ఆడబోతుందో అర్థం అవుతుందని పేర్కొన్నారు.

వీళ్ళ కోసం రాలేదు

వీళ్ళ కోసం రాలేదు

ఆయన నేను వీళ్ళ కోసం వచ్చా అని అనుకుంటున్నారు అంటూ అల్లు అరవింద్, గోపీచంద్ వైపు చూపించిన ఆయన నేను వాళ్ళ కోసం రాలేదు మీ కోసం వచ్చాను అంటూ అభిమానులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మీ నుంచి నేను చాలా ఎనర్జీ ఇంటికి తీసుకు వెళతాను చాలా పాజిటివ్ వైబ్స్ తీసుకు వెళతాను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత అల్లు అరవింద్ కు తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెలిసిందే అని పేర్కొన్న ఆయన తర్వాత హీరో గోపీచంద్ తండ్రితో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

గోపీచంద్ తండ్రితో అనుబంధం

గోపీచంద్ తండ్రితో అనుబంధం

గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గారు తన కాలేజీలో సీనియర్గా ఉండేవారని ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ గా పోటీ చేస్తానని చెప్పి తనను దగ్గరకు తీసుకున్నారని, అప్పటి నుంచి ఒక అన్నలా కాలేజీలో ధైర్యం ఇస్తూ ఒక అండగా ఉండేవారు అని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు కలిసి సినిమాలు చేయలేక పోయినా ఆయన కుమారుడు గోపీచంద్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే తనకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో పరిచయం

ఆ సమయంలో పరిచయం

మరోపక్క మారుతి గురించి ప్రస్తావిస్తూ మారుతి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో తనకు పరిచయం అయ్యాడని నీలో ఒక దర్శకుడు ఉన్నాడు వెళ్లి దర్శకత్వం మీద దృష్టిపెట్టమని తానే పంపించానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత రావు గోపాలరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన నువ్వు నాతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అంటూ రావు రమేష్ ను వేదిక మీదే ప్రశ్నించి షాక్ కి గురయ్యేలా చేశారు చిరంజీవి.

పేరు పేరునా

పేరు పేరునా

ఇక ఆ తర్వాత బన్నీవాసు గురించి ప్రస్తావించిన మెగాస్టార్ చిరంజీవి అల్లుఅర్జున్ కోసం హైదరాబాద్ వచ్చిన బన్నీవాసు ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా ఎలా నిలబడ్డాడు అనేది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఎస్కేఎన్ గురించి కూడా ప్రస్తావించిన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించిన హీరోయిన్లను, అలాగే మిగతా ఆర్టిస్టులను పేరుపేరునా పలకరించి ఈవేంట్లో తన స్పీచ్ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X