చిరంజీవి చేతుల మీదుగా టైగర్ నాగేశ్వరరావు లాంచ్.. అలా తనకు సినిమా మిస్సయిందన్న చిరు!

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఆ తరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఆ సినిమాను ఊగాయి రోజున గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. ఈ వేడుకకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

 టైగర్ నాగేశ్వరరావు

టైగర్ నాగేశ్వరరావు

'క్రాక్' అనే సినిమాతో సువర్ హిట్ అందుకున్నారు రవితేజ. ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తరువాత రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి సినిమాలతో పాటు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

భారీ బడ్జెట్ తో

భారీ బడ్జెట్ తో


రవితేజ నటిస్తోన్న మొట్టమొదటి పాన్‌ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

గ్రాండ్‌గా సినిమా లాంఛ్‌

గ్రాండ్‌గా సినిమా లాంఛ్‌


1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, స్టువర్టుపురం గజదొంగగా పేరున్న నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్లో సినిమా యూనిట్ సమక్షంలో గ్రాండ్‌గా సినిమాను లాంఛ్‌ చేశారు.

రిజెక్ట్ చేయడానికి

రిజెక్ట్ చేయడానికి


ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాకు ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్, ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ టైగర్ నాగేశ్వరరావు తాను చేయాల్సిన సినిమా అని అంటూ షాక్ ఇచ్చారు. తనకు ముందుగా డైరెక్టర్ టైగర్ నాగేశ్వరరావు స్టోరీ చెప్పినప్పుడు ఒక దొంగను హీరోగా చూడడం ఏంటి ? అనుకున్నా ఆ తర్వాత స్టోరీ రాబిన్ హుడ్ రేంజ్ లో అనిపించింది అని చెప్పుకొచ్చారు. అదే స్టోరీ రవితేజ దగ్గరకు వెళ్లడం మంచిదయిందని, ఆ పాత్ర రవితేజకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అన్నారు. అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని ఆయన మాత్రం వెల్లడించలేదు.

 ఆసక్తికరంగా

ఆసక్తికరంగా


ఇక ఈ సినిమాలో కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్త్యున్న ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక చిరంజీవి క్లావ్ కొత్తగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడికి హ్యాండ్ ఓవర్ చేశారు. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X