అనిల్ రావిపూడికి మెగాస్టార్ షరతులు.. ఆ విషయంలో చిరు సీరియస్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. చివరిగా మెగాస్టార్ 'భోళా శంకర్' చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. అంతకుముందు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో మాత్రం మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషనల్ వసూళ్లను రాబట్టింది. రూ.250 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. అయితే ఇందులో రవితేజ కూడా నటించడం గమనార్హం. దీంతో మెగాస్టార్ సోలోగా ఇటు థియేటర్లలోనూ, అటు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ తన రాబోయే చిత్రాలను మరింత శ్రద్ధగా, ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా తెరకెక్కించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు మల్దిడి వశిష్ఠ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న సోషల్ ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మెగాస్టార్ కూడా దాదాపుగా ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో నెక్స్ట్ ప్రాజెక్టుపై చిరు ఫోకస్ చేశారు.

Megastar Chiranjeevi Key Decision for Director Anil Ravipudi Movie Here is Interesting Details
2025 సంక్రాంతికి విడుదలైన ' సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో అనిల్ రావిపూడి సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో బ్యూటిఫుల్ కామెడీ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం థియేటర్లలో దుమ్ము లేపింది. బాక్సాఫీస్ వద్ద కూడా లాంగ్ రన్ లో కాసుల వర్షం కురిపించింది. కాగా అనిల్ రావిపూడి నెక్స్ట్ పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో మెగాస్టార్ ను తన అభిమానులకు సరికొత్తగా చూపిస్తానని ఇప్పటికే అనిల్ రావిపూడి హామీనిచ్చారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేసే పనిలోనూ టీమ్ నిమగ్నమై ఉన్నది. మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకునేందుకు టీం సిద్ధమవుతోంది. అయితే ఈ లోగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ కండిషన్ పెట్టారని తెలుస్తోంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయాలని మెగాస్టార్ సూచించినట్టు తెలుస్తోంది.

Take a Poll

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రానికి బాస్ కేవలం 90 రోజుల గడువు మాత్రమే ఇచ్చారంట. అంటే మూడు నెలల్లోగా చిరంజీవికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలన్న మాట. కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్, ఆకట్టుకునే కామెడీ, అద్భుతమైన డాన్సులు, తదితరాలన్నీ మెగాస్టార్ ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

అయితే మామూలుగానే అనిల్ రావిపూడి తన చిత్రాలను త్వర త్వరగా ఫినిష్ చేస్తుంటారు. ఇక బాస్ ఆదేశాలతో వీలైనంత త్వరగా నే చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియన్స్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. లవ్, కామెడీ, యాక్షన్ లోను తనదైన ముద్ర వేస్తున్న అనిల్ రావిపూడి అన్నింట ఆరితేరిన మెగాస్టార్ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది అభిమానుల్లో ఉత్కంఠకు తెరలేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X