చండాలమైన బూతులు , నా నోటితో చెప్పలేను.. సల్మాన్ ఖాన్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్
భారతీయ చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. ఒకే ఇండస్ట్రీలో కలిసి పనిచేసే వారే కాదు.. వేర్వేరు పరిశ్రమలకు చెందిన వారు కూడా స్నేహంగా మెలుగుతున్నారు. ఉదాహరణకు టాలీవుడ్‌ను తీసుకుంటే.. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, మల్లూవుడ్ ఇండస్ట్రీలతో తెలుగు నటీనటులు సఖ్యతగా ఉంటారు. అన్ని పరిశ్రమలలోనూ మనవాళ్లకు ఫ్రెండ్స్ ఉన్నారు. కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే కాదు.. రెండు ఇండస్ట్రీలకు చెందినవాళ్లు కలిసి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాగా.. నాలుగు దశాబ్థాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా .. అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టను పెంచి టాలీవుడ్‌కి ఐకాన్‌గా మారారు. అజాత శత్రువుగా, వివాహిదరహితుడిగా చిరంజీవికి పేరుంది.

దశాబ్ధాల కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. సినీరంగానికి అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో మెగాస్టార్‌ను గౌరవించింది భారత ప్రభుత్వం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ను చిరంజీవికి ప్రకటించారు అక్కినేని నాగార్జున .
ఇకపోతే ఈ ఏడాది మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి స్థానం సంపాదించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ చేతుల మీదుగా ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు చిరు. 155 సినిమాలలో, అత్యధిక పాటల్లో డ్యాన్సులు చేసినందుకు గాను ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు.
చిరంజీవికి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. అలాగే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు ఆయనకు సన్నిహితులే. హిందీ ఇండస్ట్రీలోనూ చిరుకి ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. వీరిద్దరిది దశాబ్ధాల అనుబంధం. ఇక స్నేహానికి ప్రాణమిచ్చే సల్మాన్ .. ఎన్నోసార్లు ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అలాగే చిరంజీవిపై అభిమానంతో గాడ్‌ఫాదర్ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించారు.
అయితే గాడ్‌ఫాదర్‌లో నటించినందుకు సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సల్మాన్‌కు ఎంతో కొంత ఇవ్వాలని డబ్బుతో కొందరినీ ముంబైలోని ఆయన నివాసానికి పంపానని.. డబ్బు తీసుకుని సల్మాన్ దగ్గరికి వెళ్లిన వ్యక్తి నిమిషాల వ్యవధిలో బయటికి వచ్చేశాడని చెప్పారు. ఏం జరిగిందని అడగ్గా.. సల్మాన్ బండ బూతులు తిట్టాడని.. నా నోటితో చెప్పలేనని, సినిమాల్లో అయితే బీఫ్ సౌండ్ వేయాల్సి వస్తుందని చిరు అన్నారు. కేవలం నా పైనా, చరణ్ పైన ఉన్న అభిమానంతోనే సల్మాన్ ఈ పాత్ర చేశారని.. కానీ ఆయన రుణం మరో విధంగానైనా తీర్చుకుంటామని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











