వైసీపీ దగ్గరి వ్యక్తితో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. అతని దర్శకత్వంలో ఊహించని కాంబినేషన్

మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయసులో కూడా గ్యాప్ లేకుండా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక విధంగా యువ హీరోల కంటే వేగంగా ఆయన త్వర త్వరగా షూటింగ్లను కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ముఖ్యంగా యువ దర్శకులను కూడా ఆయన లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఊహించిన విధంగా మెగాస్టార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్న ఒక దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు గతంలో వైసిపి పార్టీ ప్రచారాల్లో కూడా పాల్గొన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Megastar chiranjeevi new movie with ysrcp leader kalyan krishna kurasala

డిఫరెంట్ కథలపై చర్చలు: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మాస్ కమర్షియల్ సినిమా చేస్తే ఏ తరహాలో ఉంటుందో ఆ సినిమా కలెక్షన్స్ తోనే అర్థం అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆయన మరిన్ని డిఫరెంట్ కమర్షియల్ మాస్ సినిమాలను లైన్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక డిఫరెంట్ కథ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు.

అలా నమ్ముతున్న.మెగాస్టార్: అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు నేటి తరం యువ దర్శకులు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. మెగాస్టార్ కూడా దర్శకులు అనుభవాన్ని అలాగే ట్రాక్ రికార్డును పెద్దగా పట్టించుకోకుండా మంచి కంటెంట్ తో స్క్రిప్టి సిద్ధం చేసుకుంటే చాలు వారికి గ్రీన్ సిగ్నల్ అయితే చేస్తున్నారు. మెహర్ రమేష్ తో ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు వరుస డిజాస్టర్స్ లో ఉన్న కూడా మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు అంటే ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు.

Megastar chiranjeevi new movie with ysrcp leader kalyan krishna kurasala

లైన్ లో యువ దర్శకులు: ఇక మెగాస్టార్ చిరంజీవి మరి కొంతమంది యువత దర్శకులను కూడా లైన్లో పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్ మలినేని తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపించింది. అలాగే వెంకీ కుడుములతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ దానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఆ లోపు దర్శకుడు నితిన్ తో మరో సినిమా చేయనున్నాడు.

వైసీపీ నేతతో సినిమా: అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి వైసిపి పార్టీకి చెందిన ఒక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు. నాగార్జునతో బంగార్రాజు, సోగ్గాడే చిన్నినాయన సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన కళ్యాణ్ కృష్ణ కురసాల అని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ గతంలో వైసిపి పార్టీ తరఫున ప్రచారాలలో కూడా పాల్గొన్నాడు.

Megastar chiranjeevi new movie with ysrcp leader kalyan krishna kurasala

ఆ అనుబంధం అప్పటిదే..: కళ్యాణ్ కృష్ణ మరెవరో కాదు వైసిపి పార్టీలో కీలకమైన నాయకుడు అలాగే మంత్రిగా చేసినటువంటి కన్నబాబు సోదరుడు. ఇక కన్నబాబు తరపున గతంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అయితే గతంలో కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ అనుబంధం వారికి ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X