జూనియర్ ఎన్టీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ కాల్.. ఆ విషయం చెప్పగానే ఎంతో సంతోషించాను అంటూ..
మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ యాక్టర్ గా ఉన్నప్పటికీ తోటి నటీనటులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టార్ గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా చిన్న సినిమాలకు మద్దతుగా నిలుస్తూనే ఉంటారు. న్యూ టాలెంట్ ఎక్కడ ఉన్నా కూడా సపోర్ట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇక స్టార్ హీరోల టాలెంట్ చూసి మొహమాటం లేకుండా వారిని పొగుడుతూ ఉంటారు. ఇక ఇటీవల స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

మెగా నందమూరి అనుబంధం
నిజానికి మెగా ఫ్యామిలీకి నందమూరి కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. ముఖ్యంగా హరికృష్ణ ఫ్యామిలీ మెగా బ్రదర్స్ తో అప్పట్లో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇరు కుటుంబాల మహిళలు కూడా రెగ్యులర్ గా ఫంక్షన్లలో పాల్గొనేవారు. ఆ రెండు కుటుంబాల మధ్య అంతగా సాన్నిహిత్యం ఉండేది.

RRR సినిమాతో
జూనియర్ ఎన్టీఆర్ కూడా మొదటి నుంచి మెగా హీరోలతో ఫ్రెండ్లిగానే ఉంటున్నాడు. ఎక్కడైనా ఫంక్షన్స్ లలో కలిస్తే మెగా హీరోలతో నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉంటాడు. ఇక రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. RRR సినిమాతో వారు మరింత దగ్గరయ్యారు.

కోవిడ్ పాజిటివ్ రావడంతో
ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కోవిడ్ భారిన పడిన విషయం తెలిసిందే. తనతో పాటు కుటుంబంలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇటీవల సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. ఇక ఎవరు ఆందోళన చెందకముందే ప్రస్తుతం క్వారంటైన్ లోనే ఉంటూ వైద్యుల సమక్షంలో జాగ్రత్తలు తీసురుకుంటున్నట్లు చెప్పాడు.
Recommended Video

మెగాస్టార్ ఫోన్ కాల్
ఇక తారక్ కు అగ్ర హీరోలు కూడా స్పెషల్ గా కాల్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా కాల్ చేసినట్లు తెలిపారు. 'కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా బాగానే ఉన్నారు. తను చాలా ఉత్సాహంగా, ఎనర్జీటిక్ గా ఉన్నారని తెలుసుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను..' అంటూ మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.


Click it and Unblock the Notifications











