అందరికంటే ఎక్కువ ఎదిగిపోయాడు.. Jr పవర్ స్టార్ 'అకిరా నందన్'కి మెగాస్టార్ పవర్ఫుల్ విషెస్

ఏప్రిల్ 8 మెగా ఫ్యామిలీకి నిజంగా స్పెషల్ డేట్ అనే చెప్పాలి. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తుల బర్త్ డే ఒకేరోజు ఉంటే ఆ కిక్కే వేరు. అటు ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానులకు కూడా సంబరాలే. కరోనా కారణంగా లాక్ డౌన్ ని దృష్టిలో ఉంచుకొని కంట్రోల్ లో ఉంటున్నారు గాని లేకపోతే పార్టీలు సంబరాలు ఒక రేంజ్ లో ఉండేవి. ఓకేరోజు అల్లు అర్జున్ - అకిరా నందన్ పుట్టినరోజు కావడం మెగా అభిమానులకు స్పెషల్ డేట్ గా మారింది. అలాగే అక్కినేని అఖిల్ బర్త్ డే కూడా ఇదే రోజు కావడం విశేషం..

 బన్నీ కోసం స్పెషల్ బర్త్ డే విషెస్..

బన్నీ కోసం స్పెషల్ బర్త్ డే విషెస్..

ఫ్యామిలీ తో పాటు అల్లు అర్జున్ ముద్దు పేరు 'బన్నీ' అభిమానుల్లో బలంగా పాతుకుపోయింది. 37 ఏళ్ల వయసులోకి వచ్చిన బన్నీ చూస్తుండగానే నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లొనే కాకుండా నేషనల్ వైడ్ గా బెస్ట్ డ్యాన్స్ చేయగల హీరోల్లో బన్నీ ఒకడు. బన్నీకి ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి అలాగే అభిమానుల నుంచి బెస్ట్ విషెస్ అందుతున్నాయి. ఇక మెగాస్టార్ బాగుండాలబ్బా.. అంటూ 'పుష్ప' కాన్సెప్ట్ లో విష్ చేశారు.

జూనియర్ పవర్ స్టార్ పోస్టర్స్ తో అభిమానుల హంగామా..

జూనియర్ పవర్ స్టార్ పోస్టర్స్ తో అభిమానుల హంగామా..

పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఫ్యాన్ మెడ్ బర్త్ డే పోస్టర్స్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా ఆయన అభిమానులు అకిరాకు ఆప్యాయంగా బర్త్ విషెస్ చెబుతున్నారు.

మెగాస్టార్ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ విషెస్..

మెగాస్టార్ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ విషెస్..

మెగాస్టార్ చిరంజీవి అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని పోస్ట్ చేశారు. చిన్నప్పుడు అకిరాను ఎత్తుకున్న ఒక ఫోటో జత చేసి తనదైన శైలిలో పోస్ట్ పెట్టారు. మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.. పవర్ఫుల్ ఫ్యూచర్ ఉంటుందని హ్యాపి బర్త్ డే అకిరా అని ట్వీట్ చేశారు.

Recommended Video

#HappyBirthdayAlluArjun: Allu Arjun Special Gift To Fans
అఖిల్ కూడా నా కొడుకే..

అఖిల్ కూడా నా కొడుకే..

బన్నీ - అకిరా లతో పాటు అక్కినేని తనయుడు కూడా ఇదే తేదీన జన్మించడంతో సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి అఖిల్ కి కూడా తన స్పెషల్ విషెస్ ని అందించారు. చరణ్ కి తమ్ముడు, నాకు సురేఖకు ఒక కుమారుడి లాంటివడాని అఖిల్ కి కూడా నా బెస్ట్ బర్త్ విషెస్ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X