పవన్ కల్యాణ్‌తో పోటాపోటీగా.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్.. ప్రకాశ్ రాజ్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం
పింక్ రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం రికార్డు వసూళ్ల దిశగా అడుగులెస్తున్నది. వారాంతంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు 100 కోట్లకు చేరువైన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ నటనపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వకీల్ సాబ్ సినిమా సెకండాఫ్‌లో ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య సీన్లు ఆసక్తికరంగా ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ పోటాపోటీగా నటించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో చిరంజీవిని కలిసిన ప్రకాశ్ రాజ్‌ను అభినందనలతో ముంచెత్తారు.

తనను ప్రకాశ్ రాజ్ కలిసిన సందర్భాన్ని పురస్కరించుకొని చిరంజీవి ట్వీట్ చేశారు. అద్భుతమైన నటుడు ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు ఉంటే తోటి నటీనటులు కూడా తన గేమ్‌ను మరో లెవెల్‌లో చూపిస్తారు. వకీల్ సాబ్‌లో ఆయన నటన అద్భుతంగా ఉంది. పవన్ కల్యాణ్‌తో కలిసి పలు సన్నివేశాలకు జీవం పోశారు. అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్‌కు ప్రత్యేకమైన అభినందనలు అంటూ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ స్పూర్తిని ఇచ్చే.. ప్రోత్సహించే అన్నయ్య. మీ ప్రశంసతో సంతోషంలో మునిగిపోయాను. అంటూ ప్రకాశ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











