తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది.. మెగాస్టార్ స్పెషల్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ఎం చేసిన కూడా మనసును తాకేలా చేస్తారని మరోసారి నీరూపించారు. రాఖీ పండగ సందర్భంగా ఆయన పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా వీడియోలో మెగాస్టార్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మెగాస్టార్ సోదరీమణులు మాధవి రావ్, విజయ్ దుర్గ ఇద్దరు కూడా రాఖీ పండగ సందర్భంగా అన్నయ్య చిరంజీవిని కలిసి రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరు కూడా మెగాస్టార్ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ వారికి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇద్దరిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని కొట్టుకోవద్దని కూడా కామెంట్ చేసి నవ్వించారు.
అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్ ఒక మంచి సందేశం ఇచ్చారు. 'నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని మెగాస్టార్ వివరణ ఇచ్చారు. దీంతో ఆ వీడియోను మెగా అభిమానులు కూడా వైరల్ అయ్యేలా షేర్ చేసుకుంటున్నారు.

ఇక మెగాస్టార్ నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో పరిస్థితులను భట్టి మళ్ళీ రీ స్టార్ట్ చేయాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











