‘నాగార్జున ఆయన ఒక్కరి కాళ్లు మాత్రమే మొక్కుతాడు’.. మెగాస్టార్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ మధ్యలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాలతో సంక్రాంతికి దుమ్ములేపారు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకో లేకపోయాయి. ఈ క్రమంలో తాజాగా కుబేరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. కుబేరా చిత్రం జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా హైదరాబాద్ లో కుబేరా సక్సెస్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు ప్రసంగించారు. ముఖ్యంగా నాగార్జున గురించి ఓ సీక్రెట్ చెప్పుకొచ్చారు.
కుబేరా చిత్రం విశేషాలు..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కుబేరా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఎపీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, అజయ్ కైకాల నిర్మాతలుగా వ్యవహరించారు. రూ.120 కోట్ల వరకు చిత్రానికి ఖర్చు చేశారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

ముఖ్య అతిథిగా చిరంజీవి..
కుబేరా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించడం, పైగా ఆ సినిమాలోని అన్నీ పాత్రలు ఆకట్టుకోవడం, శేఖర్ కమ్ముల డైరెక్షన్, మ్యూజిక్ ఇలా అన్నీ విషయాల్లో ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో మేకర్స్ కూడా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సక్సెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన కుబేరా సక్సెస్ ఈవెంట్ కు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా టీమ్ ను అభినందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు, రష్మిక మందన్నపై ప్రశంసల వర్షం కురిపించారు.
నాగార్జునకు ప్రత్యేకమైన వ్యక్తి..
అక్కినేని నాగార్జున గురించి మెగాస్టార్ చిరంజీవి ఒక రహస్యాన్ని చెప్పారు. కుబేరా చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించిన నిర్మాత సునీల్ నారంగ్ తండ్రి నారాయణ దాస్ నారంగ్ గురించి చిరంజీవి మాట్లాడారు. నారాయణ దాస్ నారంగ్ అంటే మాకు ఎంతో ఇష్టమని, ముఖ్యంగా నాగార్జున ఎవ్వరి కాళ్లకు నమస్కరించరని కేవలం నారాయణ దాస్ కాళ్లకు మాత్రం నమస్కరించేవారని చెప్పారు. ఆయనంటే మాకు చాలా అభిమానమని చెప్పారు. ఇక నాగార్జునకు నిర్మాత నారాయణ దాస్ నారంగ్ అంటే ఎంత అభిమానమో చిరంజీవి చెప్పే ప్రయత్నం చేశారు.
నాగ్, చిరు రాబోయే చిత్రాలు..
నాగార్జున చివరిగా నా సామీరంగ, ప్రస్తుతం కుబేరా చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే నాగార్జున తన కెరీయర్ లో 99 చిత్రాల్లో నటించారు. నెక్ట్స్ 100వ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ 'విశ్వంభర', అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మెగా157, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న మెగా158 చిత్రాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











