రామ్ చరణ్ అలాంటి స్టంట్స్.. భయపడ్డ తండ్రి చిరంజీవి.. ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 160కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఒక్కో చిత్రంతో ఒక్కో ప్రయోగం చేశారు. చిరంజీవి చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఒక లెక్క ఆ తర్వాత ఒక లెక్క అనేలా ట్రెండ్ సెట్ చేశారు. చిరంజీవి నటించని జొనర్ అంటూ లేదు.. మాగ్జిమమ్ అన్నీ ఏరియాలను కవర్ చేశారు. చిరంజీవి హీరోగా అరంగేట్రం చేశాక... ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. డ్యాన్స్, యాక్షన్, సినిమా కథల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయని ప్రముఖులు, రీసెంట్ గా మురళీ కృష్ణ కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే.... మెగాస్టార్ చిరంజీవి నటవారసత్వాన్ని రామ్ చరణ్ ఎత్తుకున్న సంగతి తెలిసిందే. తన నటన, డ్యాన్స్, యాక్షన్, అన్నింటికన్నా మించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మెగా ఫ్యామిలీకి మరో మార్గంగా కనిపించాడు. అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ అన్ని విషయాల్లో తగ్గుతూ నెగ్గుతున్నాడు. దాంతో పాటు క్రేజీ ప్రాజెక్ట్ లతో తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు రామ్ చరణ్. 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా క్రేజీ దక్కించుకున్నాడు.

కాగా... రామ్ చరణ్ విషయంలో చిరంజీవి ఎంతగానో భయపడ్డ సందర్భం ఒకటి ఉందంట. రామ్ చరణ్ కు కెరీర్ లో మొట్టమొదటిగా బిగ్ హిట్ ఇచ్చిన చిత్రం 'మగధీర' అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా స్టోరీతో పాటు భారీ యాక్షన్ సీన్లు కూడా కనిపిస్తుంటాయి. ఆ సమయంలో చరణ్ కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటే చిరంజీవి చూడా ఎంతగానో భయపడ్డారంట. అప్పుడే తన తండ్రి కూడా చిరంజీవి చేసే స్టంట్స్ చూసి ఎంత బాధపడ్డారోనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు మాటలు వైరల్ గా మారాయి.
ఇక రామ్ చరణ్ ఇప్పుడు 100 కోట్ల హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే చరణ్ కెరీర్ బిగినింగ్ లో ఎంతో కష్టపడ్డారు. ప్రతి సినిమాకు చాలా ఎఫర్ట్ పెట్టారు. ఈ విషయాన్ని తనతో వర్క్ చేసిన ప్రతి డైరెక్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఎస్ఎస్ రాజమౌళి చరణ్ నటవిశ్వరూపం గురించి చాలా సార్లు గుర్తు చేశారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ ల్లోనూ చరణ్ దుమ్ములేపుతాడని గతంలో చెప్పారు. కాగా.. ఎస్ఎస్ రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్ లో 'మగధీర' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోనే మొదటి రూ.100 కోట్లు సంపాదించిన చిత్రంగానూ రికార్డు క్రియేట్ చేసింది.
ఇక సినిమాల విషయంలో ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ ఎంత శ్రద్దగా ఉన్నారో తెలిసిందే. తండ్రి ఒకవైపు.. తనయుడు మరోవైపు ఉండి టాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నెక్ట్స్ చిరంజీవి నుంచి సోషియో ఫాంటసీ విత్ యాక్షన్ జోనల్ లో 'విశ్వంభర' చిత్రం తెరకెక్కబోతోంది. కాగా రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఆర్సీ16, సుకుమార్ తో ఆర్సీ17 చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో బుచ్చిబాబు ఆర్సీ16 ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











