చిరంజీవిని ఇన్ స్పైర్ చేసిన నటుడు.. మెగాస్టార్ సక్సెస్ కు కారణం వీరే
మెగాస్టార్ చిరంజీవిని ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో 50 శాతం వరకు ఆయన అభిమానులే ఉంటారు. ఆయన నుంచి ఇన్ స్పైర్ అయ్యి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన వారై ఉంటారు. అయితే చిరంజీవి ప్రస్తుతం మెగాస్టార్ గా కీర్తి పొందుతున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఇక తాజాగా తన కెరీయర్ ప్రారంభంలో 1977లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారో తాజాగా వెల్లడించారు. వరల్డ్ ఆడియెన్స్ విజువల్స్ అండ్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్ లో పాల్గొని తన కెరీయర్ ప్రారంభ దశను పంచుకున్నారు.
చిరంజీవి సినీ ప్రస్థానం..
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం 1978లో ప్రారంభమైంది. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరచయం అయ్యాడు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో తన డ్యాన్స్, నటన, రియల్ స్టంట్స్ తో సంచలనంగా మారాడు. డూప్ లేకుండానే భారీ యాక్షన్ సీక్వెన్స్ ల్లో నటించి మెప్పించారు. అనతి కాలంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు. ఖైదీ, స్వయం కృషి వంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయారు. చిరంజీవి కెరీయర్లో పద్మశ్రీ, నంది అవార్డుల, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులను అందుకున్నారు. రీసెంట్ గా పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ప్రముఖ సంస్థల నుంచి అరుదైన పురస్కారాలను అందుకుంటూనే ఉన్నారు.

Wave Summitలో పాల్గొన్న స్టార్స్..
భారతదేశాన్ని ప్రపంచ దేశాలలకు ధీటుగా నిలబెట్టాలని, వరల్డ్ కంట్రీస్ కు కేంద్రంగా నిలపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం Waves అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. World Audio Visuval and Entertainment Summit 2025 కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సమ్మిట్ లో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ హాజరయ్యారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, హేమామాలిని, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్ తో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 'లెజెండ్స్ అండ్ లెగసీస్ : ది స్టోరీస్ దట్ ఇండియాస్ సోల్' అనే సెషన్ ను నిర్వహించారు. ఇందులో అక్షయ్ కుమార్ చిరంజీవి కెరీయర్ పై ప్రశ్నించారు.
చిరంజీవిని ఇన్ స్పైర్ చేసిన నటులు..
Wave Summitకు హాజరైన చిరంజీవి తన కెరీయర్ ప్రారంభ దశ గురించి వివరించారు. తనకు చిన్నప్పటి నుంచే నటనపైనా అమితాసక్తి ఉండేదని చెప్పారు. అలా స్కూల్ లో వేసిన ఆ నాటకానికి మొదటి బహుమతి దక్కిందని, కాలేజీలోనూ మొదటి బహుమతి దక్కిందని చెప్పారు. ఇక యావరేజ్ మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎలాగైనా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అదే విషయాన్ని తనతో ఉండేవారికి చెబితే భయపెట్టారని, మన వళ్ల అవుద్దా అని సందేహపడ్డారని చెప్పారు. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, కృష్ణ వంటి సూపర్ స్టార్ ఉన్నారని, వారికి భిన్నంగా చిత్ర పరిశ్రమకు నేనేం ఇవ్వగలనో బాగా ఆలోచించి ప్రణాళికలు వేశానని చెప్పారు.
అదే సమయంలో బాలీవుడ్ లో మృగయ చిత్రం చూసి సహజ నటనను మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నానని, అమితాబ్ బచ్చన్ 'షోలే'తో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం, కమల్ హాసన్ నుంచి డ్యాన్స్ వంటి విషయాల్లో స్ఫూర్తి పొందినట్టు చెప్పారు. ఆ తర్వాత వాటిల్లో నైపుణ్యం సాధించి తనదైన శైలిలో ప్రదర్శించినట్టు తెలిపారు. ఇలా అందరి టాలెంట్ ను గుర్తించి, తనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశానని చెప్పారు... ఇక చిరంజీవి నెక్ట్స్ 'విశ్వంభర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తర్వలో అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం కానుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా సెట్స్ మీదకు రానుంది.


Click it and Unblock the Notifications











