అది మన తప్పే .. ప్రేక్షకులది కాదు: చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Chiranjeevi: ఇండస్ట్రీ, మూవీ మేకర్స్ పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలు సక్సెస్ కాకపోవడానికి ప్రేక్షకులు కారణం కాదని, మూవీ మేకర్స్ కారణమన్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే.. చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతున్నాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ హీరో సత్యదేవ్, డార్లింగ్ ధనంజయ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జీబ్రా. ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియ భవాని శంకర్, జెనీఫర్ పిక్కినాటో హీరోయిన్ గా నటించారు. సత్యరాజ్, సునీల్ కీలకపాత్రను పోషించగా పద్మ ఫిలిమ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 22న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన 'జీబ్రా' మెగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

'జీబ్రా' మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..'ప్రేమతో పిలిస్తే తాను ఎక్కడైనా వస్తాను. నాకు ప్రేమ కావాలి. అభిమానం కావాలి. అలాంటి అభిమానం నిండుగా మెండుగా లభిస్తుంది. కోవిడ్ ప్రపంచంలోని పలు రంగాలను అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమా రంగం ఏమైపోతుందనుకునే సందర్భంలో ప్రేక్షకలు ఓటీటీ లకు అలవాటు పడిపోయారు. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మళ్లీ థియేటర్లకు తీసుకురాగలం. వాళ్ళని మనం సంతృప్తి పరచగలవా? అనే అనుమానం కలిగింది' అన్నారు.
చిరంజీవి కంటిన్యూ చేస్తూ.. 'ఓటీటీలో సినిమాలకు అలవాటు పడిన వారిని థియేటర్లకు తీసుకురావడం కష్టం. కేవలం హై బడ్జెట్ సినిమాలు, బిగ్ హీరో సినిమాలు మాత్రమే థియేటర్లలో చూస్తారు. పెద్ద సినిమాలను మాత్రమే థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారని భావించాను. కానీ. నా ఆలోచనలు అవన్నీ కరెక్ట్ కాదు.. ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు. ఏదైనా సినిమాలు ఆడలేదంటే.. అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు.. ప్రేక్షకుల తప్పు కానే కాదు'అని చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు.

'2024లో ఆరంభంలో 'హనుమాన్' సినిమాతో శుభారంభం జరిగింది. ఆ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైస్ గా హిట్ కొట్టింది. అలాగే.. నిహారిక తీసిన 'కమిటీ కుర్రాళ్ళు', సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు', ఆయ్, మత్తు వదలరా 2 లాంటి చిన్న సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. మొన్న దీపావళీకి వచ్చిన అమరన్, క, లక్కీ భాస్కర్ లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల వెనకాల పెద్ద పెద్ద డైరెక్టర్లు, బడా హీరోలు ఎవరు లేరు. కోటానికోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన సినిమాలు కానే కావు. కంటెంట్ అనేది సినిమాలకు ఆయు పట్టు. మంచి కంటెంట్ ఇవ్వగలిగితే.. ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. మంచి సినిమాలను అందరూ ఆదరిస్తారు ' అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు .
'సినిమాలు ఆడవు.థియేటర్లకు ప్రేక్షకులు రారు. ఓటీటీలకు అలవాటు పడిపోయారనడం అవాస్తవం. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమా థియేటర్లకు వస్తారు. ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఎంతైనా ఖర్చు పెడతారు. వారినీ ఎంటర్టైన్ చేసే విధంగా మనం మంచి కంటెంట్ను ఇవ్వాలి. అందుకు మనం శ్రద్ధ ఆసక్తులతో సినిమాలు తీయాలి' అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











