Chiranjeevi Konidela: భార్య కోసం చిరంజీవి స్పెషల్ కవిత.. మెగా స్టైల్‌లో బర్త్ డే విషెస్!

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈయన హీరోయిన్ మాత్రం ఎప్పటికీ సురేఖనే. భార్యగా 1980లో చిరంజీవి జీవితంలో అడుగు పెట్టిన ఆమె అంటే చిరంజీవికి ప్రాణం. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకొచ్చాడు చిరంజీవి. అయితే ఈరోజు చిరంజీవి భార్య సురేఖ కొణిదెల పుట్టిన రోజు. ఈ సందర్భంగానే మెగాస్టార్ మరోసారి ఆమెపై ప్రేమ కురిపించాడు. స్పెషల్ గా ఓ కవిత కూడా రాశాడు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి భార్యగా.. ఇంటి పెద్ద కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టిన సురేఖ అప్పటి నుంచి ఇప్పటి వరకు మెగా కుటుంబాన్ని ఒక్కతాటిపై నడిపిస్తోంది. భర్త, మరుదులు, వారి పిల్లలు అంతా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నా ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పటికీ వీరంతా చక్కగా కలిసుంటున్నారంటే సురేఖ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఫిబ్రవరి 18వ తేదీ అంటే ఈరోజు సురేఖ పుట్టిన రోజు. ఈ క్రమంలోనే అనేక మంది ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 Megastar Chiranjeevi Special Birth Day Wishes to His Wife Surekha Check Details

ముఖ్యంగా సురేఖ జీవిత భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవి భార్యకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేధికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. ఆమె కోసం తానే స్వయంగా ఓ కవితను కూడా రాశారు. రాసిన మూడు లైన్ లలోనే సురేఖ అంటే తనకు ఎంత ఇష్టమో చిరంజీవి వివరించారు. అలాగే తన జీవితం అంతా సురేఖ ఉందంటూ ఈ ఒక్క కవిత ద్వారా వెల్లడించారు.

ఇంతకీ చిరంజీవి రాసుకొచ్చిన ఆ కవిత ఏంటంటే.. నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ... నా భాగస్వామి సురేఖ! అంటూ రైమింగ్ తో అదరగొట్టాడు మెగాస్టార్. ఆ తర్వాత హ్యాపీ బర్త్ డే టు మై లైఫ్ లైన్ అండ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంత్ సురేఖ అంటూ చెప్పుకొచ్చారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

 Megastar Chiranjeevi Special Birth Day Wishes to His Wife Surekha Check Details

ప్రస్తుతం చిరంజీవి, సురేఖలో అమెరికా పర్యటనలో ఉన్నారు. వాలెంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14వ తేదీన విదేశాలకు వెళ్లిన ఈ జంట ఇంకా తిరగి రాలేదు. లవర్స్ డేతోపాటు పుట్టిన రోజును కూడా అక్కడే జరపాలనే ఉద్దేశంతోనే చిరంజీవి ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి ఆయన సురేఖకు ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X