ఈ సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైంది.. మేనల్లుడి సినిమాపై మెగాస్టార్ స్పెషల్ పోస్ట్
చాలా రోజుల తరువాత మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ సందడి కనిపించనుంది. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా క్రిస్టమస్ కనుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆడియెన్స్ కంటే కూడా సినీ వర్గాల్లోనే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న మొదటి మిడియమ్ బడ్జెట్ సినిమా ఇదే.
సినిమా సక్సెస్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి కూడా కొందరు నిర్మాతలు వారి సినిమాల రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మేనల్లుడు సినిమాపై బాధ్యతాయుతంగా ట్వీట్ తో సపోర్ట్ చేశారు.

లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న మొదటి సినిమా కాబట్టి ఇది ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైనది. ఈ సినిమాకు లభించే ఆదరన వల్ల చిత్ర పరిశ్రమకు ఒక స్ఫూర్తి లభిస్తుంది. ఇక ప్రేక్షకులు బాధ్యతగా మాస్క్ లు ధరించి సోషల్ డిస్తేన్సింగ్ పాటిస్తూ ఈ సినిమాను థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ వివరణ ఇచ్చారు. ఇక సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను BVSN ప్రసాద్ నిర్మించగా సుబ్బు దర్శకత్వం వహించాడు.


Click it and Unblock the Notifications











