twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్దన్న బాధ్యతల్లో చిక్కుకున్న చిరంజీవి.. అన్నిటికీ విమర్శలేనా?

    |

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ మొత్తానికి ఒక పెద్దన్నగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా దాసరి ఎలా అయితే టాలీవుడ్ లో అన్ని విషయాలకు తానున్నానని అభయమిచ్చి ప్రతి విషయంలో సహాయపడుతూ ఉండేవారో చిరంజీవి కూడా ఇప్పుడు అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ఆయనకు అనేక రకాల చిక్కులు తెచ్చిపెడుతోంది.. ఏంటి ఆ చిక్కులు ? అసలు ఏమైంది అనే విషయంలోకి వెళ్తే

    సమాజ హితం

    సమాజ హితం

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక స్థాయికి వచ్చినప్పటి నుంచి అనేక సమాజ హితమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించడమే కాక ఆయన అభిమానులు కూడా ఎప్పుడూ తమకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వెళ్లారో అప్పుడు ఆయన మీద అనేక ఆరోపణలు, నిందలు వచ్చిపడ్డాయి.

    మళ్ళీ సినిమాల్లోకి రావడంతో

    మళ్ళీ సినిమాల్లోకి రావడంతో

    అయితే అవన్నీ ఒకప్పటి మాట ఆయన రాజకీయాలు వదిలేసి మళ్లీ వచ్చే సినిమాలు చేస్తూ ఉండడంతో అందరూ ఇది వరకటిలా ఆయనను అభిమానించడం మొదలు పెట్టారు. అయితే దాసరి మరణం తర్వాత సినీ ఇండస్ట్రీలో దాదాపు అన్ని విషయాలకు పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా సన్నిహితంగా మెలగాలి వస్తోంది.

    మంచిపనులు చేస్తుంటే

    మంచిపనులు చేస్తుంటే

    అందులో భాగంగానే ఆయా ప్రభుత్వాలు ఏవైనా మంచి పనులు చేస్తున్నప్పుడు, అలాంటి గొప్ప విషయాలు తన దృష్టికి వచ్చినప్పుడు మెగాస్టార్ తన ట్విట్టర్ వేదికగా ఆయా ప్రభుత్వాలను, ప్రభుత్వ అధినేతలను ప్రశంసిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు అలా చేయడమే ఆయనకు తలనొప్పిగా మారింది. దానికి ముఖ్య కారణం ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడమే.

    వ్యాక్సిన్ విషయంలో

    వ్యాక్సిన్ విషయంలో

    ఈరోజు చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక విషయం గురించి ప్రశంసించారు. జూన్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రికార్డు స్థాయిలో వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి సుమారు 13 లక్షల పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన నేపథ్యంలో చిరంజీవి జగన్ ను జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు.

    వేరే ఉద్దేశాలు లేకపోయినా

    వేరే ఉద్దేశాలు లేకపోయినా

    ఆయనకు వేరే ఉద్దేశాలు లేకపోయినా ఇప్పుడు ఈ ట్వీట్ ఒక పక్క సంచలనంగా మారింది. ఎందుకంటే వ్యాక్సిన్ పంపిస్తున్న కేంద్రాన్ని ఆయన పొగడలేదని చెబుతూ టీడీపీ సహా జనసేన కార్యకర్తలు సైతం చిరంజీవిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దారుణంగా ఈ విషయంలో ట్రోల్ చేస్తున్నారు.

    Recommended Video

    Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
    సఖ్యతగా ఉండాల్సి రావడంతో

    సఖ్యతగా ఉండాల్సి రావడంతో

    సినిమా ఇండస్ట్రీకి పెద్దలలో ఒకరిగా వ్యవహరిస్తున్న చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వాలతో సఖ్యతగా ఉండాల్సి వస్తోంది. ఆ సఖ్యతను ప్రదర్శించే సమయంలోనే ఆయనకు ఈ వ్యతిరేకత వచ్చేట్టు చేస్తోంది. ఒక రకంగా ఆయన చేస్తున్నది మంచి కోసమే అయినా సరే రాజకీయ కోణం నుంచి చూస్తున్న చాలామంది ఆయన మీద విమర్శల గుప్పిస్తున్నారు.

    English summary
    As we all know Megastar Chiranjeevi Struck Between Industry and Politics. he tweeted about vaccination drive in andhra pradesh and gets targeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X