Mega Star Chiranjeevi: స్టేజ్ ఎక్కలేక, అమీర్ ఖాన్ సాయం పట్టగా..మెగాస్టార్‌కి ఏమైంది?

నాలుగున్నర దశాబ్ధాలకు పైగా తెలుగు వారిని తన నటనతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ప్రపంచంలో మరే నటుడికి సాధ్యం కానీ విధంగా అలరించినందుకు గాను ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ చేతుల మీదుగా ఆయనకు గిన్నిస్ రికార్డ్స్‌ను అందజేశారు. అయితే ఈ ఈవెంట్‌లో చిరంజీవి డల్‌గా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

అమీర్‌ఖాన్ - చిరంజీవి కలిసి ఆదివారం హైదరాబాద్‌లో కీలక ప్రెస్ మీట్ పెడుతున్నారని వార్తలు వచ్చేసరికి ఏం జరగబోతుందా అని అభిమానులు, సినీ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇద్దరూ కలిసి కొత్త సినిమా ఏమైనా అనౌన్స్ చేస్తున్నారా , లేదంటే ఇంకేదైనా చెబుతారా అనే కామెంట్స్ వచ్చాయి. ఇంతలో చిరంజీవికి గిన్నిస్ బుక్‌లో స్థానం దొరికిందని మీడియాలో బ్రేకింగ్స్ వచ్చాయి. అయితే ఏ విషయంలో అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఆ కాసేపటికే ఈవెంట్ ప్రారంభమై అమీర్, చిరులు వేదిక మీదకి వచ్చారు.

Megastar Chiranjeevi Suffering From Chikungunya For the last 25 days here s the details

ప్రపంచ సినీ చరిత్రలో 156 సినిమాలలో, 537 పాటలలో 24 వేలకు పైగా స్టెప్పులు వేసినందుకు గాను చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తున్నట్లు గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ఆ మాట చెప్పగానే వేదిక మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆ వెంటనే దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అమీర్ ఖాన్ చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ.. చిరంజీవి తన పెద్దన్నయ్య అని, ఆయన ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. ఆయన ఆర్డర్ వేస్తే చాలు.. పరిగెత్తుకొస్తానని చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్నారు.

Megastar Chiranjeevi Suffering From Chikungunya For the last 25 days here s the details

చిరంజీవి మాట్లాడుతూ.. గిన్నిస్ బుక్‌లోకి తన పేరు ఎక్కుతుందని తాను కల్లో కూడా ఊహించలేదని.. దీనికి కారణమైన నా దర్శక, నిర్మాతలు , అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. డ్యాన్స్‌పై నాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఇదంతా సాధ్యమైందని చిరు తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడు తనకు నటన కంటే డ్యాన్స్ అంటేనే ఇష్టమని .. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేసేవాడినని మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సావిత్రి, నరసింహారావు, రోజా రమణి తదితరులు తనను ప్రోత్సహించారని చిరంజీవి చెప్పారు. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని నాడు బడా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న లింగమూర్తి తనను దర్శక నిర్మాతలకు సిఫారసు చేశారని మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు.

ఇదిలాఉండగా.. గిన్నిస్ బుక్ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మెగా అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కినట్లుగా ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు నిర్వాహకులు చిరంజీవిని, అమీర్‌ఖాన్‌ను వేదికపైకి ఆహ్వానించారు. అయితే మెగాస్టార్ మెట్లు ఎక్కలేక ఇబ్బందిపడ్డారు.. ఆయన పరిస్ధితిని గమనించిన అమీర్ చేయి అందించి స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. దీంతో చిరంజీవికి ఏమైందా అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మెగాస్టార్ గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. చికెన్ గున్యా వచ్చిందంటే కీళ్లు పట్టేస్తాయి.. మనిషి నిలబడటం కూడా కష్టమే. అలాంటిది అనారోగ్యంగా ఉన్నప్పటికీ జీవితంలోనే అత్యంత అరుదైన ఘట్టం కావడంతో ఓపిక తెచ్చుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చిరు. అసలు విషయం తెలియడంతో మెగాస్టార్ కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X