Bhola Shankar Teaser: షికారుకు వచ్చిన శేర్.. చిరు తెలంగాణ స్టైల్ మామూలుగా లేదు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇక టీజర్ లో మెగాస్టార్ నెవ్వర్ బిఫోర్ అనేలా మాస్ యాంగిల్ తో మెప్పిస్తున్నాడు. అంతే కాకుండా మాస్ తెలంగాణ డైలాగ్స్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. ఇక సినిమా టీజర్ మొత్తంగా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..
బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్: ఆరు పదులవయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంకా యువ హీరోలా స్పీడ్ కు తగ్గట్టుగానే మంచి మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు అంతకుమించి అనేలా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వేదళం సినిమాకు రీమేక్ అయినప్పటికీ కూడా భోళా శంకర్ సినిమా సరికొత్తగా ఉండబోతోంది అనే టీజర్ తో అర్థమయిపోయింది.

యంగ్ లుక్ తో మెగాస్టార్: ఆగస్టు 11వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే అభిమానుల సమక్షంలో గ్రాండ్గా విడుదల చేశారు. ఇక టీజర్ లో అయితే మెగాస్టార్ చిరంజీవి ముందుగా తన లుక్కుతోనే ఎంతగానో ఆకట్టుకున్నారు. ఫిట్నెస్ విషయంలో కూడా మెగాస్టార్ ఎంత జాగ్రత్తగా ఉంటారో మరోసారి అర్థమయింది. ఆయన చాలా యంగ్ లుక్కుతో కలర్ఫుల్ డ్రెస్సులలో చలాకీగా కనిపిస్తున్నారు.

షికారుకు వచ్చిన శేర్: ఇక వచ్చి రావడంతోనే టీజర్ లో విల్లన్స్ ని ఊచకోత కోసే ఎంట్రీ సీన్ తో డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం 33 మందిని చంపేశాడు అని విలన్ చెప్పడం ఆ తర్వాత షికారుకు వచ్చిన శేర్ ని భే.. అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈసారి పూర్తి స్థాయిలో ఆయన తెలంగాణ భాషలో అద్భుతమైన డైలాగ్స్ నుంచబోతున్నట్లు అర్థమవుతుంది.

అదిరిపోయే యాక్షన్: ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ అయితే మామూలుగా లేవు అనిపిస్తోంది. ఫ్యాన్స్ విజిల్స్ వేయడం పక్కా అని కూడా కొన్ని షాట్స్ చూస్తేనే అర్థమవుతుంది. దర్శకుడు మెహర్ రమేష్ ఈసారి మెగాస్టార్ ను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు మొదట పోస్టర్ తోనే అర్థమైంది. ఇక ఈసారి టీజర్ తో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు.
అందరూ కూడా నా వాళ్లే..: ఇక చివరలో వచ్చే ఒక డైలాగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇది నా ఏరియా అంటూ విలన్ చెప్పగా స్టేట్ డివైడ్ అయిన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నా వాళ్లే.. అన్ని ఏటియాలు మనవే అంటూ మెగాస్టార్ తెలంగాణ స్టైల్ లో చెప్పడం కూడా అద్భుతంగా ఉంది. ఏదేమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు మరోసారి థియేటర్లో పూనకాలు వచ్చేలా చేయడం పక్క అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











