ఆ రూమర్ నిజమయ్యేలా ఉంది.. RRR స్పెషల్ టీజర్‌లో మెగా సర్‌ప్రైజ్

RRR సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అందుకే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి కంటే హై రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. త్వరలో RRR నుంచి ఒక సర్ ప్రైజ్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అందులో మెగాస్టార్ చిరంజీవి ఇన్వల్మెంట్ కూడా ఉంటుందట.

Recommended Video

RRR Is Back In Action, Makers Announce #RAMARAJUFORBHEEM On October 22 | Filmibeat Telugu
టీజర్ రాబోయేది అప్పుడే..

టీజర్ రాబోయేది అప్పుడే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి మెగా హీరోలు కలిసి మొదటిసారి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా కాబట్టి అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టీజర్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. జనవరి 26న ఒక టీజర్ అయితే రాబోతోందని పక్కా సమాచారం.

టార్గెట్ సెట్ చేసుకున్న జక్కన్న

టార్గెట్ సెట్ చేసుకున్న జక్కన్న

మొదట రామ్ చరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు పాత్ర యొక్క టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చి మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ టీజర్ లో ఇద్దరు హీరోలను ఒకేసారి చూపించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఏండింగ్ లో ఉన్నాయి. సమ్మర్ లోపు పూర్తి చేయాలని జక్కన్న టార్గెట్ గా పెట్టుకున్నాడు.

అసలైతే సంక్రాంతికే రావాల్సింది..

అసలైతే సంక్రాంతికే రావాల్సింది..

ఇక ఈ సంక్రాంతికి రావాల్సిన RRR లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను అయినా ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం వలన కుదరలేదు. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఎమోషనల్ గా టీజర్ ను జనాలకు కనెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ హట్టిగానే వేసినట్లు అర్ధమవుతోంది.

మెగాస్టార్ వాయిస్ ఓవర్

మెగాస్టార్ వాయిస్ ఓవర్

మెగాస్టార్ చిరంజీవి RRR సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్ వస్తోంది. అప్పట్లో బాహుబలికి కూడా మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు రూమర్స్ రాగా అవన్నీ పుకార్లని రాజమౌళి వెంటనే కొట్టిపారేశారు. ఇక మళ్ళీ అదే దర్శకుడి వినిమాకు మెగాస్టార్ వాయిస్ తో మరింత బలాన్ని చేకూర్చడానికి సిద్ధమైనట్లు టాక్ రాగా జక్కన్న ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X