Waltair Veerayya: వీరయ్య విజయ విహారం.. గ్రాండ్ గా ఫ్యాన్స్ తో సక్సెస్ ఈవెంట్.. ఎక్కడంటే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు కొంత నెగిటివ్ కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఈ సినిమాకు బజ్ లేదు అని మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ ఫార్మాట్లో ఈసారి హిట్ కొట్టలేకపోవచ్చు అనే విధంగా కథనాలు కూడా వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏమిటో నిరూపించారు.

బాస్ మళ్ళీ తిరిగి వచ్చాడు అని అసలైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ అంటే ఏమిటో చూపించాడని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని షేర్ కలెక్షన్స్ కూడా అందించబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభను కూడా నిర్వహించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

Megastar chiranjeevi Waltair Veerayya movie succes event date fix

వీరయ్య విజయ విహారం అనే టైటిల్ తో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను తెలంగాణలో నిర్వహించబోతున్నారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ యూనివర్సిటీలో గ్రాండ్ గా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించడానికి వేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈనెల 28వ తేదీన ఈ వేడుక జరగబోతోంది. రెండు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఈ వేడుకకు రాబోతున్నారు.

Megastar chiranjeevi Waltair Veerayya movie succes event date fix

ఇక ఈ వేడుక కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాను యువ దర్శకుడు తనదైన శైలిలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక మాస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. దానికి తోడు దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. అన్నిటికంటే హైలెట్ గా మెగాస్టార్ కామెడీ టైమింగ్ కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X