రామ్ చరణ్ రెండో సంతానం .. మెగా వారసుడిపై చిరంజీవి ఎమోషనల్
దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఎంతటి సామాన్యుడైనా అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు చిరు. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్లు ఒక తరాన్ని ప్రభావితం చేసి వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా మెగాస్టార్ బలమైన మద్ర వేశారు. చిరంజీవి చూపిన బాటలో ఎంతో మంది చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు.
క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాలను అలరించడమే ధ్యేయంగా మెగాస్టార్ సినిమాలుంటాయి. సినిమాల బడ్జెట్, రెమ్యునరేషన్, వసూళ్లపరంగా టాలీవుడ్ మార్కెట్‌ను పెంచారు. రూ.కోటి పారితోషికం తీసుకుని .. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డుల్లోకెక్కారు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను అత్యున్నతమైన పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులతో చిరంజీవిని భారత ప్రభుత్వం సత్కరించింది. ఇక అత్యథిక సినిమాల్లో పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను స్థాపించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. డ్యాన్సులు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకుని ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా దూసుకెళ్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఆయన నటన, లుక్స్ పరంగా ట్రోలింగ్ జరిగింది. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో తట్టుకుని తన సినిమాలతోనే సమాధానం చెప్పారు చరణ్. కొడుకు సాధించిన దానికి చిరంజీవి పొంగిపోతూ ఉంటారు. తన స్నేహితురాలు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చరణ్.. పెళ్లయిన దాదాపు 10 ఏళ్లకు ఈ దంపతులు తల్లిదండ్రులుయ్యారు. రెండేళ్ల క్రితం ఉపాసన.. క్లింకారాకు జన్మనిచ్చారు. పాప వచ్చిన వేళా విశేషం ఏమిటో గానీ మెగా ఫ్యామిలీలో అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి.
అయితే తండ్రికైనా తన కొడుకుకి కూడా వారసుడు పుట్టాలని, తద్వారా తన వంశం నిలబడాలని ఉంటుంది. చిరంజీవి కూడా దీనికి అతీతం కాదు.. తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టారు మెగాస్టార్. దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ , వెన్నెల కిషోర్ నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. మన బిడ్డలు అభివృద్ధిలోకి వస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదని , నేను అనుభవిస్తున్న పుత్రోత్సాహాన్ని బ్రహ్మానందం కూడా అనుభవించాలని చిరు ఆకాంక్షించారు.
అంతకుముందు యాంకర్ సుమ.. చిరంజీవికి వాళ్ల తాతగారు, నాన్నగారి ఫోటోలు చూపిస్తుంది. అనంతరం ఇంట్లో మనవరాళ్లతో ఆడుకుంటున్న చిరంజీవి ఫోటోను కూడా వస్తుంది. దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ.. ఇంట్లో మనవరాళ్లతో ఉన్నప్పుడు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా నా పరిస్ధితి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. చుట్టూ ఆడపిల్లలేనని.. ఈసారి మాత్రం అబ్బాయిని కనరా అని అడిగానని , మన లెగసి కంటిన్యూ అవ్వాలని నా కోరిక అని చిరంజీవి చెప్పారు. క్లింకారా అంటే నాకు చాలా ఇష్టమని, కానీ మళ్లీ ఇంకొక అమ్మాయిని కంటాడేమోనని నాకు భయంగా ఉందని అనడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఆయన మనసులోని బాధను చరణ్ అన్న అర్ధం చేసుకోవాలంటూ మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











