God Father కోసం సల్మాన్ ఖాన్.. ఆగలేకపోతున్నామంటూ ప్రకటించిన చిరంజీవి

నెమ్మది నెమ్మదిగా తెలుగు సినిమా మార్కెట్ పరిధి విస్తరిస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా దక్షిణాదిలో ఉన్న ఇతర రాష్ట్రాల వారు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటూ చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటన చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

 లాక్ డౌన్ లో

లాక్ డౌన్ లో

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి అనే సినిమాలు చేశారు. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తూ ఉండగా కరోనా లాక్ డౌన్ వచ్చింది. ఆ లాక్ డౌన్ లో కాళీగా ఉండడం ఎందుకు అని వరుసగా సినిమా కథలు వినడం మొదలు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

గ్యాప్ లేకుండా

గ్యాప్ లేకుండా

ఈ క్రమంలోనే వరుస సినిమాలను ఆయన లైన్ లో పెట్టారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కాగా ఆ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

షూటింగ్ ముంబైలో

షూటింగ్ ముంబైలో


ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ రీమేక్ భోళా శంకర్ సినిమా షూటింగ్ తో పాటు మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమా తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్' లో చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

మ్యాజికల్ కిక్

మ్యాజికల్ కిక్

ఇక తాజాగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ భాగం అయినట్లుగా మెగాస్టార్ చిరంజీవి అధికారిక ప్రకటన చేశారు. గాడ్ ఫాదర్ సినిమా టీంలోకి మీకు స్వాగతం సల్మాన్ భాయ్, సినిమాలో మీరు అడుగుపెట్టడం ప్రతి ఒక్కరికీ ఉత్తేజాన్ని కలిగిస్తోంది. అలాగే మా ఎగ్జైట్మెంట్ అనేది వేరే లెవెల్ కి వెళ్లి పోయింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా ఆనందం కలిగిస్తోందని, సినిమాలో మీ ప్రెజెన్స్ ఆడియన్స్ కి ఒక మ్యాజికల్ కిక్ అని మాత్రం చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు.

Recommended Video

Megastar Chiranjeevi : Puneeth Rajkumar James Movie FDFS చూస్తా | Filmibeat Telugu
 మరిన్ని సీన్లు

మరిన్ని సీన్లు

ప్రస్తుతానికి ముంబై శివార్లలోని ఒక స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా కొణిదెల సురేఖ సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారు అని తెలుస్తోంది. హీరోకి అనుంగు అనుచరుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఉంటుంది. తెలుగు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు కాబట్టి సల్మాన్ ఖాన్ చిరంజీవి మధ్య మరిన్ని సీన్లు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X