#MegaPrincess తాతైన చిరంజీవి.. రామ్ చరణ్, ఉపాసనకు మెగాస్టార్ విషెస్ వైరల్!

మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మధుర క్షణాలు రానే వచ్చాయి. ఎట్టకేలకు మెగాస్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టారు. దీంతో ఇటు మెగా ఫ్యామిలీ, అటు కామినేని కుటుంబ సభ్యుల్లో అంతులేని ఆనందం ఆకాశాన్నంటుకుంటుంది. అంతేకాకుండా మెగా అభిమానుల్లో కూడా సంబురాలు మొదలయ్యాయి. మెగా ప్రిన్సెస్ కు జన్మనిచ్చిన రామ్ చరణ్-ఉపాసనకు అందరు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది.

మెగా కుటుంబంలో మెగా ప్రిన్సెస్ కాలు మోపింది. జూన్ 20 అంటే ఇవాళ తెల్లవారు జామున రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. "రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. వారికి పాప జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు" అని అపోలో వైద్యులు పేర్కొన్న ప్రకటన వైరల్ అయింది.

Megastar Chiranjeevi Wishes To Ram Charan Upasana For Blessed With Baby Girl

ఇక మహాలక్ష్మీ జన్మించడంతో చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లు విరుస్తోంది. ఇప్పటికే పుట్టిన బిడ్డను చూసేందుకు మెగా, కామినేని కుటుంబ సభ్యులు అపొలో ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తండ్రి అయ్యాడనే వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరకమైన పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, నెటిజన్లు, ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు ఈ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇత మనవరాలి రాకతో తాతగా అతిపెద్ద ప్రమోషన్ పొందిన మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగిపోయారు. దీనిపై తాజాగా రియాక్ట్ అవుతూ రామ్ చరణ్-ఉపాసనకు విషెస్ తెలియజేశారు. ట్వీట్ లో "సుస్వాగతం లిటిల్ మెగా ప్రిన్సెస్. నీ రాకతో మెగా కుటుంబంలో వేల కోట్ల సంతోషాలు విరబూసాయి. నీ అడుగుతో రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అవడమే కాదు నేను తాతను అయ్యాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది" అని చిరంజీవి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు మీమ్స్ తో, అభినందనలతో కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X