Acharya release Postponed: ‘ఆచార్య’ చిరంజీవి మూవీ రిలీజ్ ఎప్పుడంటే!
తెలుగు సినిమా పరిశ్రమపై కరోనావైరస్ మరోసారి భారీగానే దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్ తర్వాత విజృంభిస్తూ దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలకు స్పూర్తిగా నిలుస్తున్న టాలీవుడ్‌పై కరోనా మరోసారి ప్రతాపం చూపిస్తున్నది. ఇప్పటికే పలు అగ్రహీరోలు, చిన్న సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి. తెలంగాణ, ఆంధ్రలో స్వచ్ఛందంగా థియేటర్లు మూసివేతకు యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవడంతో సినిమాల రిలీజ్‌లు కూడా వాయిదా పడ్డాయి.
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రం వాయిదా పడగా.. ఆ జాబితాలో నాని నటించిన టక్ జగదీష్ కూడా చేరింది.
తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నామని తమ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి మే 13వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఆచార్య రిలీజ్ గురించి ఆలోచిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మళ్లీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. అప్పటి వరకు వేచి చూస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.
అంతేకాకుండా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రేక్షకులు, ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించండి. ఇంటి పట్టునే ఉంటూ సురక్షితమైన చర్యలను తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఆచార్య టీమ్ సూచించింది.


Click it and Unblock the Notifications











