కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన మెగా ఫ్యామిలీ.. అధికారమంతా అమ్మాయిగారిదే!
కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయడం కంటే సీరియల్స్ తీసుకోవడం బెటర్ అని మొన్నటి వరకు ఓ వర్గం సినీ ప్రముఖులు మాట్లాడుకునే వారు. సక్సెస్ అవుతుందో లేదో అనే భయంతో సినిమా రిజల్ట్ గురించి ఆందోళన చెందడం కన్నా సీరియల్స్ చేసుకోవడమే ఉత్తమమని చెబుతుంటారు. అయితే ప్రస్తుత కాలంలో సీరియల్స్ కంటే కూడా వెబ్ సిరీస్ లను నిర్మించాలని సినీ ప్రముఖులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
చాలా వరకు సినీ తారలు కూడా వెబ్ సిరీస్ లలో ఛాన్స్ వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అదే విధంగా నిర్మించడానికి కూడా సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ కూడా ఓటిటీ ఫ్లాట్ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారట. అయితే ఆ పనులన్నిటిని పెద్ద కూతురు సిష్మిత చేతుల్లో పెట్టేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

సుష్మిత మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150సినిమాకు అలాగే సైరా మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె వెబ్ సిరీస్ లను నిర్మించే బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. కుదిరితే మెగా హీరోలను కూడా వెబ్ సిరీస్ లలో భాగం చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కథలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ఈ విషయంలో మెగా స్టార్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











