మెగా యుద్ధంలో పవన్ మిస్సింగ్.. ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగు పెట్టిన తరువాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. దాదాపు అన్ని ఎకౌంట్స్ లో ఎదో ఒక పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్..ట్విట్టర్ లో కామెంట్స్.. అంటూ రోజు స్పెషల్ అప్డేట్స్ తో మెగా అభిమానులకు మరీంత దగ్గరవుతున్నారు. ముఖ్యంగా కరోనాపై మెగాస్టార్ సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే చేస్తున్నారు.

కరోనాపై స్పెషల్ ఫోకస్..
ఈ క్లిష్ట సమయంలో తనవంతు కృషిగా మెగాస్టార్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా జనాలను తన మాటలతో ఉత్తేజపరుస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. బాధ్యత గల ఒక సెలబ్రెటీగా జనాలు అందరూ బావుండాలని అలాగే పని కోల్పోయిన సినీ కార్మికులకు చారిటబుల్ ట్రస్టు ద్వారా సహాయాన్ని అందిస్తున్నారు. చిరంజీవి బాటలోనే మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తోంది.

మెగా కరోనా యుద్ధం..
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కరోనాపై జనాలకు అవగాహన వచ్చేలా ఒక స్పెషల్ ఫ్రేమ్ డిజైన్ చేశారు. మెగాస్టార్, అల్లు అరవింద్, నాగబాబు రామ్ చరణ్ , వరుణ్ తేజ్, ఉపాసన అలాగే మెగా కూతుళ్లు, మేనల్లుళ్లు ఇంకా అల్లుడు కళ్యాణ్ దేవ్ అందులో వారి కాంబినేషన్ నోట్ తో స్టిల్ ఇచ్చారు.

ఇంట్లోనే ఉండాలి..
మెగాస్టార్ సెట్ చేసిన ఫ్రేమ్ లో అందరూ కరోనాపై యుద్దం ప్రకటించేలా వారి పదాలను చూపించారు. "ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమని పంచుతాం, కాలు కధపకుండా కరోనాని తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్ ని గెలిపిస్తాం" అని మెగా ఫ్యామిలీ ఒక నినాదాన్ని ఒక్కటిగా చూపించింది.
Recommended Video

పవన్ కళ్యాణ్ మిస్..
ఆ ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే ఇంకా బాగుండేదని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అల్లు వారిలో మెయిన్ స్టైలిష్ స్టార్ కూడా లేకపోవడంతోఅల్లు ఆర్మీసైతం కాస్త నిరాశ చెందింది. ఏదేమైనా మంచి పనిలో కలిసికట్టుగా జనాలకు మెగాస్టార్ తన ఫ్యామిలితో కలిసి మంచి సందేశం ఇచ్చారని నెటీజన్స్ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











