twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీహరి కొడుకుతో... జీవితరాజశేఖర్ కూతురు రొమాన్స్?

    |

    దివంగత నటడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ 'రాజ్‌దూత్' అనే యూత్‌ఫుల్ మూవీ ద్వారా తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తుండగా కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

    మరో వైపు జీవిత రాజశేఖర్ దంపతుల చిన్న కూతురు శివాత్మిక 'దొరసాని' మూవీతో తెరంగ్రేటం చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Meghamsh, Shivathmika will soon be teaming up for romantic entertainer

    తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... త్వరలో మేఘాంశ్, శివాత్మిక కాంబినేషన్లో ఒక రొమాంటిక్ చిత్రం తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

    ఇటీవల జరిగిన 'రాజ్‌దూత్' టీజర్ లాంచ్ ఈవెంటుకు జీవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేఘాంశ్, శివాత్మిక సినిమా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    మరో వైపు రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ '2 స్టేట్స్' రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సత్యనారాయణ.... రాజ్ దూత్ సినిమా నిర్మిస్తుండటం గమనార్హం. స్టార్ కిడ్స్‌తో తీస్తున్న సినిమా కావడంతో మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకంతో ఇపుడు మేఘాంశ్, శివాత్మిక కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Film Nagar souSrihari’s son Meghamsh, Jeevitha and Rajasekhar’s younger daughter Shivathmika will soon be teaming up with each other for a romantic entertainer. A debutant will be directing the movie and Sathyanarayana will bankroll the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X