దివంగత శ్రీహరి కుమారుడి లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. రెండో ప్రాజెక్ట్ కోసం రెడీ
ప్రముఖ నటుడు దివంగత శ్రీహరి, నటి డిస్కో శాంతి కుమారుడిగా మేఘాంశ్ శ్రీహరి అందరికీ సుపరిచితులు. శ్రీహరి మరణం తర్వాత తన తండ్రి అడుగుజాడల్లో నడించేందుకు ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ మధ్యలో వచ్చిన రాజ్‌దూత్ చిత్రంతో నటనపరంగా మంచి ప్రశంసలు అందుకొన్నా.. సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో గుర్తింపు లభించలేదు తాజాగా మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు.
తన రెండో సినిమా కోసం ఇటీవల తీసిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదటి సినిమా కంటే కొత్తగా, విభిన్నంగా మేఘాంశ్ కనిపించారనే మాట వినిపిస్తున్నది. స్టైల్, బాడీ లాంగ్వేజ్, మేకోవర్‌తో ఇట్టే ఆకట్టుకొనేలా కనిపించారు. తన రెండో ప్రాజెక్టును త్వరలోనే ప్రకటిస్తామని మేఘాంశ్ వెల్లడించారు.

అర్జున్, కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన నిర్మాత ఎంఎల్‌వీ సత్యనారాయణ రూపొందించిన సినిమా నాకు కొంత నిరాశను కలిగించింది. కానీ నటుడిగా నాకు తృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ విభిన్నమైన చిత్రాల్లో నటించడానికి మాత్రమే ఎదురుచూస్తున్నాను అని మేఘాంశ్ తెలిపారు.
మేఘాంశ్ యాక్టింగ్ విషయానికి వస్తే.. తన తండ్రి నటించిన భైరవ చిత్రంతోనే బాలనటుడిగా మేఘాంశ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఊహించిన పరిస్తితుల్లో తండ్రి మరణంతో కోలుకోలేని దెబ్బ పడింది. ఆ విషాదం నుంచి తేరుకొని డిస్కోశాంతి అందించిన మనోధైర్యంతో మేఘాంశ్ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











