twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోతి కొమ్మచ్చి షూటింగ్ పూర్తి.. ఆడియెన్స్‌ను పలకరించేందుకు మేఘాంశ్, సమీర్ వేగేశ్నలు రెడీ

    |

    కరోనా వ్యాప్తి చెందుతున్నా కూడా.. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా కూడా సినిమా పరిశ్రమ ముందుకు కదులుతూనే ఉంది. షూటింగ్‌లు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. వీలైనన్నీ తక్కువ వనరులతో షూటింగ్‌లు చేస్తున్నారు. అవుట్ డోర్ షెడ్యూల్స్‌లోనూ సినిమాలను పూర్తి చేసేస్తున్నారు. అలా కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్ లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. అయితే ఈ అసాధ్యాన్ని దిగ్విజయంగా సుసాధ్యం చేసి చూపించింది 'కోతి కొమ్మచి' టీం.

    నవంబర్ 3న మొదలైన కోతికొమ్మచ్చి షూటింగ్ డిసెంబర్ మొదటి వారంతో ఒక్క పాట మినహా టోటల్ షూట్ పూర్తయింది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'కోతి కొమ్మచ్చి. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ..లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్‌కి అనుమతి ఇచ్చిన వెంటనే 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ మొదలుపెట్టామని చెప్పుకొచ్చాడు.

    Meghansh And sameer Vegesna Kothi komachi SHooting Wrapped

    సినిమా మొత్తం అవుట్ డోర్ కావడంతో కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఒక పాట మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేశామని దర్శకుడు తెలిపాడు. అమలాపురం , విశాఖపట్నం , రాజమండ్రి లో ఎలాంటి బ్రేక్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిపామని, ఈ సందర్భంగా షూటింగ్ దిగ్విజయంగా పూర్తవ్వడానికి కారణమైన యూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్వరలోనే బ్యాలెన్స్ సాంగ్ ను కూడా పూర్తి చేసి విడుదల తేదిను ప్రకటిస్తామని అన్నాడు.

    English summary
    Meghansh And sameer Vegesna Kothi komachi SHooting Wrapped,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X