భోళా శంకర్ కోసం చిరంజీవి రిస్క్.. ఆ దేశంలో కష్టాల గురించి డైరెక్టర్ ట్వీట్
ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా రీఎంట్రీలో మరింత జోష్‌తో కనిపిస్తోన్న ఆయన.. ఒకటి పట్టాలపై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే చాలా సినిమాలను చేశారు. ఈ క్రమంలోనే 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే చిరంజీవి ఇప్పుడు 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే.
వాస్తవానికి 'వాల్తేరు వీరయ్య' మూవీ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీని స్టార్ట్ చేసేశారు. దీన్ని చాలా గ్యాప్ తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టిన మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఒక్క హిట్ కొట్టని ఈ డైరెక్టర్.. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం చిరంజీవి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ అప్‌డేట్ వచ్చింది.

'భోళా శంకర్' మూవీకి సంబంధించిన షూటింగ్ స్విడ్జర్లాండ్‌లో జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి - మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మధ్య అదిరిపోయే లోకెషన్లలో సాంగ్‌ను షూట్ చేశారు. తాజాగా దీనిపై మెహర్ రమేష్ ట్వీట్ చేశాడు. 'స్విడ్జర్లాండ్‌లో చిరంజీవి, తమన్నాపై ఓ పాటను షూట్ చేసుకుని తిరిగి వస్తున్నాము. ఫారెన్ కంట్రీలోని లొకేషన్లు, వాతావరణంలో పడి చేయడం చాలా కష్టం. కానీ, మా వాళ్లు అందరూ ఎంతో నిబద్ధతో పని చేసి షూట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. వీళ్లందరికీ ధన్యవాదాలు' అంటూ అందులో పేర్కొన్నాడు. తద్వారా పరోక్షంగా చిరంజీవి రిస్క్ గురించి ప్రస్తావించాడు.
'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











