Bhola Shankar: చిరంజీవి మూవీలో మరో హైలైట్ లీక్.. ఏకంగా డైరెక్టరే రివీల్ చేశాడేంటి!
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు 'భోళా శంకర్' అనే మూవీలో నటిస్తున్నారు.
మెహర్ రమేష్ రూపొందిస్తున్న ఈ సినిమా.. తమిళంలో అజిత్ హీరోగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'వేదాళం'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై హైప్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెడీ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరణ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే టాకీ పార్టు మొత్తాన్ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది.
ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశారు. ఇలా ఇప్పటికే చిరంజీవితో సహా పలువురు కీలక నటీనటులు డబ్బింగ్ వర్క్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ అదిరిపోయే విషయాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.
సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కంప్లీట్ చేసింది. ఈ మేరకు స్టూడియోలో ఉన్నప్పటి ఫొటోను డైరెక్టర్ మెహర్ రమేష్ షేర్ చేశాడు. అంతేకాదు, 'మన మిల్కీ బ్యూటీ తమన్నా భోళా శంకర్ డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో ఆమె ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిరంజీవి, సుశాంత్, హైపర్ ఆది, హర్ష చెముడు, బ్రహ్మానందం గారితో ఆమె సీన్స్ చాలా ఫన్ క్రియేట్ చేస్తాయి' అంటూ సినిమాలోని హైలైట్‌ను లీక్ చేశాడు.
ఇక.. 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











