కంత్రి, బిల్లా, శక్తి చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ రీ ఎంట్రీ ప్రయత్నాలు

మెహర్ రమేష్ పేరు చెబితే చాలా మందికి తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ప్లాప్ చిత్రాలు మదిలో మొదులుతాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన కంత్రి, బిల్లా, శక్తి వల్ల నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనూ 2013లో వెంకటేష్ హీరోగా 'షాడో' సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత నుంచి మెహర్ రమేష్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.

కొంతకాలంగా మెహర్ రమేష్... మహేష్ బాబు, నమ్రతలతో క్లోజ్‌గా మూవ్ అవుతుండటంతో సూపర్ స్టార్ అతడికి డైరెక్షన్ చాన్స్ ఇస్తాడేమో అని కంగారు పడ్డారు. అయితే అసలు మ్యాటర్ అది కాదని తాజాగా వెలుగులోకి వచ్చింది. త్వరలో మెహర్ రమేష్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం చేయడం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

 Meher Ramesh will re-entry with web series soon

మహేష్ బాబు భార్య నమ్రత తమ సొంత బేనర్లో వెబ్ సిరీస్ లాంటివి తీయాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని స్క్రిప్టులు కూడా ఆమె విన్నారట. అయితే మంచి స్ట్రీమింగ్ పార్ట్‌నర్(అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5) దొరికితే వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ నమ్రత ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో అతడు తప్పుకోవడంతో దీన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X