యంగ్ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్: ఆమె వెళ్లిపోవడంతో లైన్‌లోకి వచ్చేసిన బ్యూటీ

దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు టాలీవుడ్ మన్మథుడు కింగ్ అక్కినేని నాగార్జున. దాని తర్వాత రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆయనకు విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉండగా.. నాగార్జున ఈ ఏడాది ఆరంభంలో 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా... ప్రతికూల పరిస్థితులు, ఇతర కారణాల వల్ల కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో ఇదీ బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకోలేకపోయింది.

వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నారు. అందులో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తోన్న 'ఘోస్ట్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభం అయింది. దీంతో ఆ అనుమానాలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ప్రస్తుతానికి మాత్రం నాగ్ బిగ్ బాస్, బంగార్రాజు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది.

Mehreen Kaur Pirzada Replace Kajal Aggarwal for Akkineni Nagarjuna Ghost

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీని వెనుక పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక, ఈ మూవీలో ఆమె స్థానాన్ని గోవా బ్యూటీ ఇలియానా భర్తీ చేయబోతుందని కూడా ఓ న్యూ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కానీ, ఈ విషయం చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'ఘోస్ట్' మూవీలో కాజల్ అగర్వాల్ స్థానంలో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదాను తీసుకున్నారట. ఇప్పటికే ఆమె ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని తెలిసింది. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తం చెల్లిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, మరికొద్ది రోజుల్లోనే ఆమె ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెహ్రీన్ పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పడు వాటిని పూర్తి చేసి.. ఆ తర్వాత నాగార్జున సినిమా చేస్తుందని అంటున్నారు.

భారీ బడ్జెట్‌తో ఎంతో రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X