నందమూరి బాలకృష్ణ సరసన కుర్ర హీరోయిన్: రూటు మార్చిన యంగ్ డైరెక్టర్

కొంత కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఆయన వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేస్తోన్న ఆయన.. ఇది పట్టాలపై ఉండగానే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించే చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను తీసుకుంటున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, ఆమె దీనికి ఒప్పుకోలేదని కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కుర్ర హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా బాలయ్యతో ఆడిపాడనుందని తెలిసింది. అయితే, ఇది మెయిన్ హీరోయిన్ పాత్రనా? లేక సెకెండ్ లీడ్ రోలా అన్నది మాత్రం సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

 Mehreen Pirzada Fix for Balakrishna Gopichand Movie

మరోవైపు, శృతి హాసన్ ఒప్పుకోకపోవడం వల్లే మెహ్రీన్‌ను తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పల్నాడు బ్యాగ్‌డ్రాప్‌తో నడిచే ఫ్యాక్షన్ కథతో రూపొందనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గానూ.. ఫ్యాక్షనిస్టుగానూ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X