నవ్వుల సందడిలో కలిసిన మెహ్రీన్ ఫిర్జాదా: ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలిసారి వచ్చిన బ్యూటీ

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా చేశారు. హీరోలు ఇద్దరూ వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. కొన్నేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'F3' మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనిపై ఓ అప్‌డేట్ వచ్చింది.

'F3' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా పలుమార్లు ఈ సినిమా చిత్రీకరణకు ఆటంకం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గత శుక్రవారమే షూట్‌ను పున: ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు 'మెల్లగా మళ్లీ నవ్వులు మొదలు' అనే క్యాప్షన్ పెట్టి సెట్స్‌లోని ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా కూడా పాల్గొంది. ఈమెకు సంబంధించిన పిక్‌ కూడా తాజాగా బయటకు వచ్చింది. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఈ బ్యూటీ పాల్గొంటోన్న మొదటి సినిమా షూటింగ్ ఇదే కావడం విశేషం.

Mehreen Pirzada joins F3 Movie Shoot

డబ్బు వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి చికాకులు వస్తాయన్న కాన్సెప్టుతో 'F3' మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో సునీల్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) కంటే మరింత ఫన్నీగా ఈ సినిమా తీస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక, ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా జోడిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X