For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విషయం చెప్పకుండా దాచేసిన యువ హీరోయిన్.. దెబ్బకు పెళ్లి వాయిదా.. !

  |

  ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఏమిటా కధ అనుకుంటున్నారా ? ఆమె మరెవరో కాదు తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న మెహ్రీన్ కౌర్ పిర్జాదా. పంజాబ్ కు చెందిన ఈ భామ ఈ మధ్య కాలంలోనే ఒక రాజకీయ నాయకుడి మనవడితో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఒక అనూహ్య కారణంతో పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  కృష్ణగాడి వీరప్రేమగాధతో ఎంట్రీ

  కృష్ణగాడి వీరప్రేమగాధతో ఎంట్రీ

  పంజాబ్ లోని ఒక సంప్రదాయ సిఖ్ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మెహ్రీన్ పిర్జాదా తెలుగులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే హిట్ అందుకుని మంచి పేరు దక్కించుకుంది ఈ భామ. దీంతో తెలుగులో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.

  అవకాశాలు లేవు

  అవకాశాలు లేవు

  రెండో సినిమా మహానుభావుడు కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు తెలుగు సహా తమిళ భాషల్లో కూడా వరుస అవకాశాలు లభించాయి. ఐతే నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామకు తర్వాత తర్వాత అన్ని డిజాస్టర్ సినిమాలు ఎదురు కావడంతో పెద్దగా అవకాశాలు అయితే దక్కడం లేదు.

  అదే చివరి హిట్

  అదే చివరి హిట్

  ఇక తెలుగులో చివరిగా అశ్వత్థామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఆ తర్వాత మరో పెద్ద సినిమా అవకాశం అందుకోలేకపోయింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్2 అనే సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో ఈ భామ హనీ అనే పాత్రలో నటిస్తోంది.. సరిగ్గా రెండేళ్ల క్రితం ఎఫ్2 సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకుంది. ఒక రకంగా ఈ భామకు ఇదే చివరి హిట్ అదే అని చెప్పవచ్చు.

  చడీ చప్పుడు లేకుండా పెళ్ళికి సిద్ధం

  చడీ చప్పుడు లేకుండా పెళ్ళికి సిద్ధం

  సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఈ భామ ఏకంగా పెళ్లికి సిద్ధం అయిపోయింది. చడీ చప్పుడు లేకుండా హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు ప్రస్తుత ఆదం పూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో ఆమె వివాహం నిశ్చయమైంది.

  పెళ్లి వాయిదా

  పెళ్లి వాయిదా

  మార్చి నెల 13వ తేదీన రాజస్థాన్ లోని జైపూర్ అలీల కోటలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ ఏడాదిలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించగా ఇప్పుడు మాత్రం ఆ పెళ్ళి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడటం పడిన మాట వాస్తవమే కాని దాని వెనుక పెద్ద కథ ఉందని అంటున్నారు. ఎంత కరోనా ఉన్నా సరే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లిళ్ల కానిచ్చేస్తున్నారు.

  అదే కారణం

  అదే కారణం

  ఈ భామ పెళ్లి వాయిదా పడటానికి కారణం నిశ్చితార్థ వేడుక అనంతరం ఆమె మెహ్రీన్, మెహ్రీన్ తల్లి ఇద్దరూ కరోనా బారిన పడటమే. అయితే హాస్పిటల్ కి వెళ్లే అవసరం లేకుండానే కరోనా బారి నుంచి బయటపడ్డామని చెబుతున్నా ఇప్పుడు రిస్క్ తీసుకుని చేసుకోవడం కంటే కాస్త పరిస్థితులు కుదుటపడ్డాక వచ్చే ఏడాది చేసుకోవడం మంచిదని పెళ్లి వాయిదా వేస్తున్నట్లు ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని ఈ భామ ముందు వెల్లడించలేదు. తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా ఈ భామ బయటకు రానీయలేదు.

  ఇప్పటికీ ఇబ్బందే

  ఇప్పటికీ ఇబ్బందే

  దానికి మరో కారణం కూడా ఉందట. ఈ కరోనా మహమ్మారి వచ్చి తగ్గిన తర్వాత కూడా కొంత మందిని ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మెహరీన్ కూడా ఎప్పుడూ రెస్ట్ తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పుకొచ్చింది. ఆమెకు ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది అని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ఈ భామ నెమ్మదిగా వర్కౌట్స్ మొదలు పెట్టానని చెప్పుకొచ్చింది.

  English summary
  We all know Mehreen Pirzada got engaged with Bhavya Bishnoi, a Congress leader and the grandson of former Haryana CM Bhajan Lal in March. They were supposed to get married soon. but actress revealed that marriage has been indefinitely postponed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X