ఎన్టీఆర్‌పై మెహ్రీన్ లవ్! ఫోటోలు షేర్ చేస్తూ ట్వీట్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ మెహ్రీన్‌కి పెద్ద హీరో ఎన్టీఆర్‌ని కలిసే అవకాశం వచ్చింది. ఇలా ఎన్టీఆర్‌ని కలవడమే గాక ఆయన పక్కనే కూర్చోవడం, కాసేపు ముచ్చటించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మెహ్రీన్.
నిన్న (జనవరి 8) జరిగిన 'ఎంత మంచివాడవురా!' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఎన్టీఆర్. ఈ సందర్బంగా వేదిక వద్ద ఆయన్ను కలిసిన మెహ్రీన్ కాసేపు సరదాగా గడిపి.. ఆయన పక్కనే కూర్చొని ఈవెంట్ చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ మేరకు సదరు పిక్స్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ''ప్రిన్సెస్ మెహ్రీన్ విత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్'' అని ట్యాగ్ చేస్తూ 'లవ్' గుర్తు ఎమోజీని పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'ఎంత మంచివాడవురా!' చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. ఉమేష్ గుప్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. గోపిసుందర్ సంగీతం బాణీలు కట్టారు. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకొని U సర్టిఫికెట్ పొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











