ఆ హీరో కోసం శ్రీకాంత్‌ను తొక్కేయాలని.. డైరెక్టర్‌కు 2 కోట్లు ఆఫర్.. ఆ పెద్దమనిషి ఎవరంటే?

సినీ పరిశ్రమలో నెగ్గుకురావడం అంత తేలికకాదు.. అక్కడ జరిగే రాజకీయాలను దాటుకుని నిలబడాలి. అడుగడుగునా వెనక్కి లాగేవారెందరో. మనతో మంచిగా ఉంటూనే, మనకి గోతులు తీసేవాళ్లు చుట్టూ ఉంటారు. ఇవి చాలదన్నట్లు అవమానాలు, చీత్కారాలకు లెక్కేలేదు. వాటిని అధిగమించి తట్టుకున్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. ఇప్పుడు స్టార్స్‌గా ఉన్నవాళ్లంతా ఇలాంటి వాటిని ఎదుర్కొని నిలబడిన వారే. తాజాగా తన జీవితంలో జరిగిన సంఘటనను, అవకాశం రానివ్వకుండా జరిగిన ప్రయత్నాలను సీనియర్ నటుడు శ్రీకాంత్ బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

చిరు స్పూర్తితో సినిమాల్లోకి
తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్దిమంది నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా టర్న్ అయిన శ్రీకాంత్‌లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. కృష్ణాజిల్లా నుంచి వలస వెళ్లి కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడిన కుటుంబంలో జన్మించారు శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి స్పూర్తిగా తాను కూడా సినిమాల్లో నటించాలని అనుకున్నారు. హైదరాబాద్‌లోని మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయనకు పీపుల్స్ ఎన్‌కౌంటర్‌లో అవకాశం లభించింది.

Meka Srikanth revealed why he rejected by Khadgam movie producer for ACP Role

చిన్న రోల్స్‌లోనూ నటించిన శ్రీకాంత్
హీరోగానే నటించాలని గిరి గీసుకుని కూర్చోకుండా నటుడిగా ఇండస్ట్రీలో స్థిరపడాలని నిర్ణయించుకున్న శ్రీకాంత్.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగారు. వన్ బై టులో జేడీ చక్రవర్తితో కలిసి హీరోగా నటించిన శ్రీకాంత్‌కు ఆమె, తాజ్ మహల్ సినిమాలు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. ఈ దశలో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి చిత్రం స్టార్ హీరోగా నిలబెట్టింది. నాటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా మహాత్మతో 100 చిత్రాలు పూర్తి చేసిన నటుడిగా అరుదైన ఘనత సాధించారు.

అఖండలో విలన్‌గా
అగ్రనటులతో కలిసి అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన ఆయన పాత్ర నచ్చితే గెస్ట్ రోల్ చేయడానికి కూడా వెనుకాడరు. అఖండ చిత్రంతో విలన్‌గానూ భయపెట్టారు శ్రీకాంత్. తన సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్, మేధ, రోహన్ సంతానం. ఇప్పటికే కుమారుడు రోషన్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు శ్రీకాంత్. ఆయన కెరీర్‌లో ఎన్నో మరుపురాని పాత్రలు ఉన్నప్పటికీ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలోని ఏసీపీ రాధాకృష్ణ రోల్ మంచి పేరు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా, లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్‌లోని సీరియస్ నటుడిని ఈ చిత్రం బయటపెట్టింది.

శ్రీకాంత్‌ను తీసేయమని కృష్ణవంశీపై ఒత్తిడి
కార్తీకేయ మూవీస్‌పై సుంకర మధుమురళీ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, సంగీత కీలకపాత్రలు పోషించారు. దేశభక్త ప్రధానంగా సాగే ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై సంచలన విజయం సాధించింది. ఖడ్గంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు దక్కింది. అయితే ఈ సినిమాలోని ఏసీపీ రాధాకృష్ణ పాత్రను శ్రీకాంత్‌తో వేయించడాన్ని నిర్మాత మధు అభ్యంతరం తెలిపారట. శ్రీకాంత్ ఫ్యామిలీ స్టార్ అని.. ఆయనకు ఈ రోల్ సెట్ కాదని కృష్ణవంశీతో చెప్పాడట. అంతేకాదు.. జగపతిబాబు లేదా మరో పెద్ద హీరోని తీసుకోవాలని ఇంకో 2 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశారట మధు.

శ్రీకాంత్ పాత్రకు బ్రహ్మరథం
కానీ కృష్ణవంశీ మాత్రం శ్రీకాంత్‌కి అండగా నిలిచి నిర్మాతతో కొట్లాడి మరి ఈ రోల్ తనకే ఇచ్చారట. ఈ ఘటనను అవమానంగా భావించిన శ్రీకాంత్.. రాధాకృష్ణ రోల్‌ని ఛాలెంజ్‌గా తీసుకుని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, చనిపోయిన ప్రియురాలి కోసం బాధపడే వ్యక్తిగా రెండు వెరియేషన్స్ చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఖడ్గం రిలీజ్ తర్వాత శ్రీకాంత్ నటనకు, ప్రజల్లో వచ్చిన స్పందన చూసిన నిర్మాత మధు కూడా శ్రీకాంత్‌ను మెచ్చుకున్నారట. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయం బయటపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X