Balakrishna's Akhanda : సీక్రెట్స్ బయటపెట్టిన శ్రీకాంత్.. వేరే లెవల్ అట!

తెలుగులో మాస్ సినిమాలకు బోయపాటి పెట్టింది పేరు. తన మొదటి సినిమా భద్ర మొదలు చివరిగా రిలీజ్ చేసిన వినయ విధేయ రామ దాత ఆయన సినిమాల్లో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణతో ఆయన ముచ్చటగా మూడోసారి అఖండ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు శ్రీకాంత్. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళితే

హిట్ కోసం ప్రయత్నాలు

హిట్ కోసం ప్రయత్నాలు

వరుస విజయాలతో ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న బాలకృష్ణకు ఈ మధ్య కాలంలో మాత్రం వరుస అపజయాలు ఎదురవుతున్నాయి. 2017లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయనకు ఆ సినిమా తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.

బోయపాటితో

బోయపాటితో

గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్లు అందించిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక బాలయ్య - బోయపాటి
కాంబినేషన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పక తప్పదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి..

తాజా ఇంటర్వ్యూలో

తాజా ఇంటర్వ్యూలో

దీంతో బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు, ఇప్పటిదాకా ఎవరికీ తెలియని విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు కంటే ఎక్కువ పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి అని కానీ.. బాలయ్య చేస్తుంది కేవలం రెండు రోల్స్ మాత్రమేనని వెల్లడించారు.

బాలయ్య పాత్ర గురించి

బాలయ్య పాత్ర గురించి

ఇక అఘోరా పాత్ర అనేది ఒక పాత్ర కాదన్న ఆయన చూసినప్పుడు మీకే అర్ధం అవుతుందని అన్నారు. ఇక సినిమాలో బాలయ్య డైలాగ్స్ కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని శ్రీకాంత్ వెల్లడించారు. అంతే కాక ఈ సినిమాలో విలన్ వరదరాజులు పాత్రలో నటిస్తున్నానని, తనకు బాలయ్యకు వచ్చే కాంబినేషన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పటి దాకా విలన్ ఎవరు అనే విషయాలు ఎవరూ వెల్లడించలేదు. కానీ అనూహ్యంగా శ్రీకాంత్ ఈ విషయాలు వెల్లడించారు.

Recommended Video

Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
మరిన్ని అంచనాలు

మరిన్ని అంచనాలు


ఇక శ్రీకాంత్ అఖండ సినిమా గురించి సీక్రెట్స్ బయట పెట్టాక సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా అంచనాలను ఏమేరకు అందుకుంటుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X