Don't Miss!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యాంకర్ రష్మీకి మెమరీ లాస్.. మరింత రెచ్చిపోయింది.. అంతకుమించి!
బుల్లితెరపై పలు టీవీ షోస్ ద్వారా బాగా ఫేమస్ అయింది రష్మీ గౌతమ్. జబర్దస్త్ కామెడీ టీవీ షో ఆమెకు ఎనలేని పాపులారిటీ తెచ్చింది. అడల్ట్ కంటెంట్‌తో స్కిట్లు వేస్తూ యాంకర్ రష్మీ పై పంచులేయడం ఈ షోలో షరా మామూలే. ఇదే ఈ షోకి ప్రాణం అనటంలో అతిషయోక్తి లేదు. కాగా ఇటు టీవీ కార్యక్రమాలు చేస్తూనే అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తున్న రష్మీ గౌతమ్.. సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌కి కూడా కిక్కివ్వడంలో ఏమాత్రం వెనుకాడదు. ప్రేక్షకలోకానికి తన అందాల రుచి చూపిస్తూ మరింత దగ్గరవుతోంది. ఇటీవలే అంతకుమించి అనే సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసిన ఈమె తాజాగా శివరంజని చిత్రంలో దానిని కంటిన్యూ చేసింది.
రొమాంటిక్ మూవీలో
నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ శివరంజని. ఈ చిత్రానికి నాగ్ ప్రభాకరన్ దర్శకత్వం వహించారు. యూ అండ్ ఐ ఎంటర్టైన్ ట్స్ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి కొత్త హైప్ తీసుకొచ్చేలా మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయించారు.
రొమాన్స్‌తో భయపెడుతూ
ఈ ట్రైలర్లో భయపెట్టే సన్నివేశాలతో పాటు పలు రొమాంటిక్ సీన్స్ చూపించి బాగా అట్రాక్ట్ చేశారు. హీరోతో రొమాన్స్ సన్నివేశాలతో రష్మీ గౌతమ్ రెచ్చిపోయి నటించింది. రొమాన్స్ సీన్స్ లో రష్మీ స్పీడ్ చూస్తూనే ఈ సినిమా రొమాంటిక్ హిట్ సినిమాగా నిలుస్తుందని అనిపిస్తోంది.
యూత్‌కి కావాల్సిన మసాలా రంగరించి
ఇక ట్రైలర్‌ని బట్టి చూస్తే ఇందులో భయపెట్టే సన్నివేశాలతో పాటు యూత్‌కి కావాల్సిన మసాలా రంగరించారని తెలుస్తోంది. హీరో హీరోయిన్ ఓ బంగ్లాకు వెళ్లడం, అందులో ఉన్న దెయ్యం రష్మీ వెంట పడటం, దానిని వదిలించుకోవడం కోసం హీరో పడే కష్టాలు మధ్య మధ్యలో రష్మీ రొమాంటిక్ సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రష్మీ.. గతాన్ని మర్చిపోవడం, హీరోతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడం, ధన్‌రాజ్ కామెడీ సినిమాలో ఆసక్తికర అంశాలని తెలుస్తోంది. అందాలు ఆరబోయడంలో తగ్గేదే లేదని ఈ సినిమా ద్వారా మరోసారి నొక్కి చెప్పనుంది రష్మీ.