ప్లాప్ దర్శకుడికి ఓకె చెప్పిన నాగ చైతన్య!
అక్కినేని నాగ చైతన్య అప్పుడప్పుడూ కొన్ని విజయాలు అందుకుంటున్నాడు. కానీ వెంటనే పరాజయాలతో డీలా పడుతున్నాడు. కెరీర్ కు జోష్ నిచ్చే సరైన విజయం చైతుకు దక్కడం లేదు. అయినా కూడా నాగ చైతన్య సినిమాల జోరు తగ్గడం లేదు. వరుస చిత్రాలతో చైతు బిజీ అవుతున్నాడు. నాగ చైతన్య కోసం దర్శకులు వరుసగా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం చైతు తన సతీమణి సమంతతో మజిలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు విక్టరీ వెంకటేష్ తో కలసి నటించే వెంకీ మామ చిత్రం రెడీగా ఉంది. అదే సమయంలో గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా చైతూతో ఓ చిత్రం చేసినందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుసగా దర్శకులు తనకు కథ వినిపిస్తుండడంతో చైతు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సరిగా లేని కథలని ఎంపిక చేసుకోకూడదని చైతు భావిస్తున్నాడు.

ఇదిలా ఉండగా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో సత్తా చాటిన మేర్లపాక గాంధీకి చైతు ఒకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మేర్లపాక గాంధీ చెప్పిన కథ నచ్చడంతో నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు చివరగా తెరకెక్కించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మించేందుకు ముందుకు వచ్చారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











