MGH Health Bulletin on SPB: బాలసుబ్రమణ్యం పరిస్థితి విషమం.. 24 గంటలుగా..
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందనే వార్తలు వస్తున్నాయి. అయితే తన కుమారుడు ఎస్పీ చరణ్ గత రెండు రోజులుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ వార్తల్లో ఎంత వాస్తవం ముందనే విషయంపై అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు ఆరా తీస్తున్నారు. అయితే టాలీవుడ్‌కు చెందిన పీఆర్ వర్గాలు, ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు సోషల్ మీడియాలో వెల్లడించిన ప్రకారం..

తండ్రి ఆరోగ్యంపై 22 తేదీన చివరిసారిగా
ఎస్పీ బాలు ఆరోగ్యంపై తన కుమారుడు ఎస్పీ చరణ్ తన ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్ రెండు రోజులకోసారి అప్‌డేట్స్ ఇస్తున్నారు. 22వ తేదీన నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. నోటి ద్వారా ద్రవపదార్థాలు అందిస్తున్నారు. త్వరలోనే ఆయన డిశ్చార్జి అవుతారు అని తన హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. దాంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

పరిస్థితి విషమంగా కావడంతో
అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురువారం క్షీణించింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు ఆరోగ్య పరిస్థితిని కుదటపరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎంజీఎం హాస్సిటల్ గురువారం 6.30 గంటలకు పూర్తిస్థాయి బులెటిన్ విడుదల చేసింది.

24 గంటలుగా పరిస్థితి దిగజారింది
ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులెటిన్‌ను ఎజీఎం విడుదల చేస్తూ.. ఎస్పీబాలు ఆగస్టు 5న ఎంజీఎం హెల్త్‌కేర్‌లో కరోనావైరస్ వ్యాధితో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎక్మో, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. పూర్తిగా ఆయనకు లైఫ్ సపోర్ట్‌తోనే చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది అని పేర్కొన్నారు.

డీఎస్పీ, తమన్ ట్వీట్లు
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తల నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖు మ్యూజిక్ డైరెక్టర్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్, తమన్, తదితరులు ట్వీట్ చేసి ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆయన శ్రేయోభిలాషులు కూడా ప్రార్థనలు చేయాలని సూచించారు. త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆక్షాక్షిస్తున్నారు.

ఆగస్టు 5వ తేదీన కరోనాతో
కరోనావైరస్ పాజిటివ్ బారిన పడిన ఎస్పీ బాలు ఆగస్టు 5వ తేదీన నుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే సుదీర్గ కాలంగా ఆయనను వెంటిలేటర్‌పై పెట్టి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. గత కొద్దికాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సంతోషంగా ఫీలయ్యారు.


Click it and Unblock the Notifications











