Animal Movie: యానిమల్ దెబ్బకు అర్ధరాత్రుళ్లు థియేటర్లు ఓపెన్.. ఎక్కడెక్కడో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. డిసెంబర్ ఒకటో తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే స్టార్ హీరోహీరోయిన్లతో పాటు క్రేజీ డైరెక్టర్ సినిమాను తెరకెక్కించడంతో ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాపై భారీ రెప్సాన్స్ దూసుకుపోతూనే ఉంది. ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీసు బద్ధలు అవుతోంది. యానిమల్ దెబ్బకు అర్ధరాత్రుళ్లు కూడా థియేటర్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రణ్ బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాను.. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్.. రణ్ బీర్ కపూర్ తండ్రిగా ఇరగదీశారు. ముఖ్యంగా బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. దీంతో ఈ సినిమాకు భారీ ఎత్తునే బిజినెస్ జరిగింది. ముఖ్యంగా రూ.200 కోట్ల మేర బిజినెస్ జరగ్గా... నాలుగు వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదన అయింది.

అయినప్పటికీ ఆ థియేటర్లు సరిపోవడం లేదు. గత మూడ్రోజులుగా ఈ సినిమా షోలన్నీ ఫుల్ గా బుక్ అయ్యాయి. ఏమాత్రం ఖాళీ సీట్లు లేకుండా నడవడమే కాకుండా... అవి సరిపోక చాలా మంది అభిమానులు పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకున్న థియేటర్ల యజమానులు.. అర్ధరాత్రుళ్లు కూడా షోలు వేసేందుకు ముందుకు వస్తున్నాయి. ముంబైలో అయితే ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ విషయాన్ని పీవీఆర్ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపాడు. ముఖ్యంగా మిడ్ నైట్ షోలు కూడా వేస్తున్నారట.

అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటలకు కూడా ఈ షోలను యాడ్ చేయడం గమనార్హం. కేవలం ముంబైలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకు అదనపు షోలు వేస్తున్నారట. అయితే సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు ఆరుకు మించి షోలు వేయలేకపోతున్నారట. ముఖ్యంగా రోజులో రెండు గంటలు మాత్రమే గ్యాప్ ఇస్తూ మళ్లీ మళ్లీ షోలను నడిపించాల్సి వస్తుందట. అంతేకాకుండా మల్టీప్లెక్సుల్లో పని చేసే వాళ్ల కూడా అన్ని షిఫ్టుల్లో పని చేస్తున్నారట. మరి ఈ రేంజ్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూళ్లు చేసిందో మనం ఇప్పుడు చూద్దాం.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 129 కోట్లు రాబట్టింది. అంటే ఇంకా రూ. 81 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











