సింపుల్ గా.. హుందాగా.. దగ్గుబాటి వారి కోడలంటే అంతేగా.. అంతేగా..
దగ్గుబాటి వారింట పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి అంశమూ అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంది. ఇక జనాలు ఎప్పుడెప్పుడు మిహీకా బజాన్ ను బ్రైడల్ లుక్ లో చూసేద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా ఫొటోలతో అమ్మాయి కూడా అప్పుడే ఆడియన్స్ పల్స్ పట్టేసినట్లు వారిని చుట్టుముట్టేస్తోంది. ఇక ఇప్పటివరకూ ఒకెత్తు అయితే, బ్రైడల్ లుక్ మరొకెత్తు కానుంది.
ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా మిహీకా పెళ్లి దుస్తులు డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. మహీకా అభిరుచిని దృష్టిలో పెట్టుకుని హుందాతనం ఉట్టిపడే విధంగా లెహంగాను రూపొందించారట. క్రీమ్, గోల్డ్ రంగుల కలయికలో ఉండే లెహంగాకు, చిక్కన్ కరీ, గోల్డ్ మెటల్ వర్క్, జర్దోసి వర్క్ చేశారని తెలుస్తోంది. ఇక అమ్మాయి చేనేత బంగారు వర్ణ దుప్పట్టా ధరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, మిహీకా ధరించబోయే ఈ పెళ్లి లెహంగాను తయారు చేసేందుకు సుమారు పదివేల గంటలు సమయం పట్టిందని డిజైనర్ వెల్లడించారు.

ఇక ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ తమన్నా రూజ్ సైతం మిహీకా చాలా సింపుల్ మేకప్ వేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. నితిన్ భార్య షాలినీకీ ఈమే మేకప్ వేయడం మరో విశేషం. ఇకపోతే మిహీకా మేకప్ ను వీలైనంత సహజంగా ఉంచుతూనే కాస్త గ్లామరస్ టచ్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మహీకా ఓ దృఢమైన మహిళ వ్యాపారవేత్త కాబట్టి, ఆమె పూర్తి సంప్రదాయకంగా కనపించేందుకు ఇష్టపడటం లేదని, అదే విధంగా అసహజమైన మేకప్ కూడా ఇష్టపడరని అందుకే, వీలైనంత సహజంగా మేకప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











