Milkha Singh మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి.. ఫర్హాన్ అఖ్తర్, మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్స్

ప్రపంచ క్రీడాలోకంలో ఫ్లయింగ్ సిక్కుగా ప్రసిద్ధి గాంచిన పరుగు వీరుడు మిల్కాసింగ్ కరోనావైరస్ వ్యాధితో మరణించారు. ఆయన మృతితో క్రీడా, సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. మిల్కాసింగ్ బయోపిక్‌ భాగ్ మిల్కా భాగ్ చిత్రంలో మిల్కాసింగ్ నటించిన ఫర్హాన్ అఖ్తర్ భావోద్వేగానికి లోనయ్యారు. మిల్కా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ...

ఫర్హాన్ అఖ్తర్ ట్వీట్ చేస్తూ... మిల్కాసింగ్ మరణంపై ఫర్హాన్ అఖ్తర్ స్పందిస్తూ.. మీరు ఇకలేరంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. మీతో ఉన్న అనుబంధం కారణంగా అలా అనిపించవచ్చు. ఒకరి గురించి మనసులో ఒకరకమైన ముద్ర పడితే అది అంతగా చెరిగిపోవడం కష్టం. నా మనసులో మీరు ఎప్పుడు సజీవంగానే ఉంటారు. ఎదుటి వారిని గౌరవించే సంస్కారం, ప్రేమ, సహృదయంతో గొప్పగా ప్రేమించే మనసు ఉన్న వ్యక్తి మీరు. మీరు ఎదగడానికి పడిన కష్టం, నిజాయితీ, అంకుఠిత దీక్ష కారణంగానే మీరు ఆకాశమంత కీర్తిని సొంతం చేసుకొన్నారు. మా లాంటి జీవితాలకు స్పూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి మీరు. మీరు నన్ను తండ్రిలాగా, స్నేహితుడి మాదిరిగా ఆదరించారు. దానిని గొప్ప వరంగా భావిస్తాను. అందరికీ మీరు గొప్పస్తూర్తి. విజయానికి మారు పేరు. ఎప్పుడూ మీరు నా గుండెల్లో ఉంటారు అని ఫర్ఫాన్ అఖ్తర్ అన్నారు.

Milkha Singh death:Farhan Akthar, Chiranjeevi, Mahesh Babu emotional tribute

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీ... మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్టను, భారత పతాకాన్ని అంతర్జాతీయస్థాయిలో రెపరెపలాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్‌కు నివాళి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. స్పోర్ట్స్ లెజెండ్ మిల్కా సింగ్ మరణంతో తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయాను. ఆయన మరణంతో దేశానికి తీరని నష్టం. ఆయన లెగసీ భావితరాల అథ్లెట్లకు స్పూర్తిని ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులకు గొప్ప స్పూర్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X